LOADING...
Atchannaidu: రైతులకు ఊరట.. 'అన్నదాత సుఖీభవ' పథకం కింద భారీగా నిధుల విడుదల
రైతులకు ఊరట.. 'అన్నదాత సుఖీభవ' పథకం కింద భారీగా నిధుల విడుదల

Atchannaidu: రైతులకు ఊరట.. 'అన్నదాత సుఖీభవ' పథకం కింద భారీగా నిధుల విడుదల

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 30, 2025
04:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

గత వైసీపీ ప్రభుత్వంపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతులకు రూపాయికే బీమా అందిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, జగన్ మూడేళ్ల పాటు బీమా ప్రీమియంలు ఎగ్గొట్టారని ఆయన ఆరోపించారు. బుధవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో బీమా చెల్లించామని చెప్పిన వ్యాఖ్యలు అబద్ధాలని, ప్రభుత్వం జీవో లేని విధంగా మోసం చేసిందని అచ్చెన్న ఆరోపించారు. జగన్ హయాంలో రూ.3,138 కోట్ల బీమా బకాయిలు పెండింగ్‌లో ఉండటానికి ప్రధాన కారణం ప్రీమియంలు చెల్లించకపోవడం అని స్పష్టంగా చెప్పారు.

Details

రైతుల ఖాతాల్లోకి రూ.3,516 కోట్లు జమ

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఉచిత బీమా పథకాన్ని మళ్లీ ప్రారంభించామని చెప్పారు. 'అన్నదాత సుఖీభవ' పథకం కింద ఆగస్టు 2న రైతుల ఖాతాల్లో రూ.3,156 కోట్లు జమ చేయనున్నట్టు వెల్లడించారు. అంతేకాకుండా, పులివెందుల రిజర్వాయర్ నుంచి నీటిని రైతులకు ఇవ్వకుండా జగన్ తన బంధువుల కంపెనీలకు మళ్లించారని ఆరోపిస్తూ ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ చర్యలు రైతుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న జగన్ ప్రభుత్వ నిజ స్వరూపాన్ని బయటపెడతాయని అన్నారు.