Page Loader
Fraud loan app ads: మోసపూరిత లోన్ యాప్ యాడ్స్‌ను తొలగించండి..కేంద్రం ఆదేశం 
Fraud loan app ads: మోసపూరిత లోన్ యాప్ యాడ్స్‌ను తొలగించండి.. కేంద్రం ఆదేశం

Fraud loan app ads: మోసపూరిత లోన్ యాప్ యాడ్స్‌ను తొలగించండి..కేంద్రం ఆదేశం 

వ్రాసిన వారు Stalin
Dec 27, 2023
04:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

Fraud loan app ads: ఆన్‌లైన్ మోసాల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను తమ ప్లాట్‌ఫారమ్‌లలో మోసపూరిత రుణ యాప్‌ల ప్రకటనలను చూపించవద్దని ఆదేశించింది. మోసపూరిత యాప్‌ల ద్వారా ఏదైనా మోసం జరిగితే.. యాప్‌లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఫేస్‌ బుక్, ఇన్‌స్టాగ్రామ్, గూగుల్ వంటి మెటా ప్లాట్‌ఫారమ్‌లను 7 రోజులలోపు మోసపూరిత రుణ యాప్‌ల ప్రకటనలను తొలగించాలని, కేంద్రం ఆదేశాలను పాటించాలని మంత్రిత్వ శాఖ కోరింది.

ఆన్ లైన్

ఐటీ నిబంధనలను సవరించే పనిలో కేంద్రం

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు మోసపూరిత ప్రకటనను ప్రచురించకుండా ఉండటానికి ప్రభుత్వం ఇప్పటికే ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) నిబంధనలను సవరించే పనిలో ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. కేంద్రం ఆదేశాలను పాటించకుంటే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నవంబర్‌లో ప్రభుత్వం నిషేధించిన జాబితాలో ఉన్న అనేక ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో మోసపూరిత లోన్ యాప్‌ల ప్రకటనలు కనపడుతున్నాయని కేంద్రం వెల్లడించింది. ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఈ అంశంపై మంత్రిత్వ శాఖ చాలా నెలలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ)‌తో చర్చిస్తోందన్నారు. ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడానికి మేము ఇటీవల ప్రయత్నాలను ముమ్మరం ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు.