Tirupathi Ralway Station: వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌గా తిరుపతి రైల్వే స్టేషన్.. భక్తులకు కొత్త అనుభూతి
అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో భాగంగా తిరుపతి రైల్వే స్టేషన్‌కి మహత్తరమైన మార్పులు రాబోతున్నాయి. ఈ పథకంలో భాగంగా రూ.300 కోట్లు వెచ్చించి, స్టేషన్‌ను పూర్తిగా కొత్త రూపంలో తీర్చిదిద్దుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తిరుపతి రైల్వే స్టేషన్‌కు హంగులు అద్దుతున్నారని చెప్పవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 53 రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. తిరుపతి రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మార్చబోతున్నారు. ఈ పవిత్ర నగరంలోని రైల్వే స్టేషన్‌కు రూ.300 కోట్లతో ఆధునికీకరణ జరుగుతోంది. ప్లాట్‌ఫాంల పైభాగాన్ని కూడా వినియోగించే విధంగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ స్టేషన్ నిర్మాణం అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు అనేక హంగులు కల్పించబోతున్నారు.
అన్ని ప్లాట్‌ఫాంలను అనుసంధానించే ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు
కొత్త టెర్మినల్ భవనం, ప్లాట్‌ఫాంలను అనుసంధానించే నిర్మాణాలు, అలాగే కమర్షియల్ స్పేస్‌ను అభివృద్ధి చేస్తుండటం విశేషం. రూ.300 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. రద్దీని తట్టుకునేలా ప్లాట్‌ఫాంలపై అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రధాన టెర్మినల్ భవనం నుంచి అన్ని ప్లాట్‌ఫాంలను అనుసంధానించే ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు, వెయిటింగ్ లాంజ్‌లు, కమర్షియల్ ఏరియా వంటి సదుపాయాలు నిర్మించబడుతున్నాయి. తిరుపతి రైల్వే స్టేషన్ దేశంలో అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లలో ఒకటిగా నిలిచింది. ఇందుకోసం అమృత్ స్టేషన్ స్కీమ్‌లో రూ.300 కోట్లు కేటాయించారు.
కొంత మేర పూర్తైన కొత్త టెర్మినల్ భవన నిర్మాణం
తిరుపతి రైల్వే స్టేషన్‌లో కొత్త టెర్మినల్ భవన నిర్మాణం ఇప్పటికే కొంత మేర పూర్తయింది. వీలైనంత త్వరగా కొత్త సదుపాయాలు ప్రయాణికుల సేవలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్లాట్‌ఫాంల పైభాగాన్ని కూడా ప్రయోజనకరంగా వాడుకునేలా డిజైన్ చేశారు, రైళ్ల రాకపోకలకు ఆటంకం కలగకుండా అదనపు స్థలం అందుబాటులోకి తీసుకువచ్చారు. తిరుపతి నగరానికి తగ్గట్టుగా స్టేషన్ ప్లాట్‌ఫాంలు రూపుదిద్దుకుంటున్నాయి, ఇది స్థానికులకు, భక్తులకు మరింత సౌకర్యంగా మారబోతుంది.