LOADING...
Mark Tully: ప్రఖ్యాత జర్నలిస్టు, రచయిత మార్క్ టుల్లీ కన్నుమూత
ప్రఖ్యాత జర్నలిస్టు, రచయిత మార్క్ టుల్లీ కన్నుమూత

Mark Tully: ప్రఖ్యాత జర్నలిస్టు, రచయిత మార్క్ టుల్లీ కన్నుమూత

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 25, 2026
05:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రఖ్యాత జర్నలిస్టు, రచయిత 'మార్క్ టుల్లీ' ఈశ్వరాదిశ్వరానికి చేరుకున్నారు. 22 ఏళ్లపాటు బీబీసీ దిల్లీ బ్యూరో చీఫ్‌గా పనిచేశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన దిల్లీలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన సన్నిహిత మిత్రుడు, సీనియర్ జర్నలిస్టు సతీష్ జాకబ్ 'పీటీఐ'తో ధ్రువీకరించారు. మార్క్ టుల్లీ 1935 అక్టోబర్ 24న కలకత్తాలో (ప్రస్తుతం కోల్‌కతా) జన్మించారు. బీబీసీ రేడియో 4 కార్యక్రమం 'సమ్‌థింగ్ అండర్‌స్టూడ్' లో వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

Details

2005లో పద్మభూషణ్

భారత్‌పై రూపొందించిన అనేక డాక్యుమెంటరీలలో పాలుపంచుకుని, దేశం ప్రజల జీవితాలపై లోతైన అవగాహననిచ్చారు. ఆయన సేవలకు గుర్తింపుగా 2002లో నైట్‌హుడ్, 1992లో పద్మశ్రీ, 2005లో పద్మభూషణ్ వంటి ఘనతలతో సత్కరించబడ్డారు. అలాగే, ఆయన 'నో ఫుల్ స్టాప్స్ ఇన్ ఇండియా', 'ఇండియా ఇన్ స్లో మోషన్', 'ది హార్ట్ ఆఫ్ ఇండియా' వంటి అనేక ప్రాముఖ్యమైన పుస్తకాలను రచించారు. మార్క్ టుల్లీ కన్నుమూత భారతీయ జర్నలిజం, రచయితల ప్రపంచానికి నష్టమేనని వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Advertisement