Page Loader
Rajagopala Chidambaram: ప్రముఖ అణు శాస్త్ర‌వేత్త రాజ‌గోపాల చిదంబ‌రం ఇక లేరు
ప్రముఖ అణు శాస్త్ర‌వేత్త రాజ‌గోపాల చిదంబ‌రం ఇక లేరు

Rajagopala Chidambaram: ప్రముఖ అణు శాస్త్ర‌వేత్త రాజ‌గోపాల చిదంబ‌రం ఇక లేరు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 04, 2025
10:19 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ అణు శాస్త్ర‌వేత్త డాక్ట‌ర్ రాజ‌గోపాల చిదంబ‌రం(88) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ముంబై జ‌స్‌లోక్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతిప‌ట్ల శాస్త్ర‌వేత్త‌లు, రాజ‌కీయ ప్ర‌ముఖులు నివాళుల‌ర్పిస్తున్నారు. ఆయన కుటుంబ స‌భ్యుల‌కు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అణు శాస్త్ర‌వేత్త‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన రాజ‌గోపాల చిదంబ‌రం, పొఖ్రాన్-1 (1975), పొఖ్రాన్-2 (1998) అణు ప‌రీక్ష‌లలో కీల‌క‌పాత్ర పోషించారు.

Details

 1999లో పద్మవిభూషణ్ ప్రదానం

అణుశ‌క్తి క‌మిష‌న్‌‌కు చైర్మ‌న్‌గా సేవ‌లు అందించారు. ఆయనకు 1999లో ప‌ద్మ‌విభూష‌ణ్‌, 1975లో ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాలు ప్రదానం చేశారు. భారత ప్రభుత్వానికి శాస్త్రీయ స‌ల‌హాదారుగా పనిచేసిన ఆయన, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్ట‌ర్‌గా, అటామిక్ ఎన‌ర్జీ క‌మిష‌న్ చైర్మ‌న్‌గా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎన‌ర్జీ సెక్ర‌ట‌రీగా విధులు నిర్వహించారు. 1994-95లో ఇంట‌ర్నేష‌న‌ల్ అటామిక్ ఎన‌ర్జీ ఏజెన్సీ గ‌వ‌ర్న‌ర్ల బోర్డుకు చైర్మ‌న్‌గా కూడా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది.