Page Loader
B.V. Pattabhiram: ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు,మెజీషియన్ బీవీ పట్టాభిరామ్ కన్నుమూత
ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు,మెజీషియన్ బీవీ పట్టాభిరామ్ కన్నుమూత

B.V. Pattabhiram: ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు,మెజీషియన్ బీవీ పట్టాభిరామ్ కన్నుమూత

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 01, 2025
04:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ మానసిక శాస్త్రవేత్త, వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ బీవీ పట్టాభిరామ్ (వయసు 75) ఇక లేరు. సోమవారం రాత్రి ఆయనకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో కన్నుమూశారు. వ్యక్తిత్వ వికాసానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన ఆయన... ఇంద్రజాలికుడు, మానసిక వైద్యుడిగా కూడా విశేషంగా ప్రసిద్ధి చెందారు. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థుల కోసం వేలాది శిక్షణా శిబిరాలు, వర్క్‌షాపులు, సెమినార్లను నిర్వహించి వారి జీవితాలపై నిలకడైన ప్రభావం చూపారు. ఆయన మృతితో విద్యా, మానసికారోగ్య, వ్యక్తిత్వ వికాస రంగాల్లో తీవ్ర లోటు ఏర్పడిందని పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. పట్టాభిరామ్‌కు అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరగనున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గుండెపోటుతో మృతి