LOADING...
Pulivendula: పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు.. రెండు కేంద్రాల్లో ప్రారంభమైన రీపోలింగ్‌  
పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు.. రెండు కేంద్రాల్లో ప్రారంభమైన రీపోలింగ్‌

Pulivendula: పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు.. రెండు కేంద్రాల్లో ప్రారంభమైన రీపోలింగ్‌  

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 13, 2025
08:43 am

ఈ వార్తాకథనం ఏంటి

పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలో భాగంగా రెండు పోలింగ్‌ కేంద్రాల్లో మళ్లీ ఓటింగ్‌ జరుగుతోంది. 3,14 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం నుంచి రీపోలింగ్‌ ప్రారంభమయ్యింది.ఈ రెండు కేంద్రాల పరిధిలో మొత్తం వెయ్యి మంది ఓటర్లు ఉండగా,వారు ఒక్కొక్కరుగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారు. వైఎస్సార్‌ జిల్లాలోని పులివెందుల,ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు మంగళవారం ఉపఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

వివరాలు 

పులివెందుల బరిలో 11 మంది అభ్యర్థులు 

నిన్నపోలింగ్‌ సమయంలో చోటుచేసుకున్న ఘర్షణలు, నిరసనల కారణంగా కొన్ని కేంద్రాల్లో రీపోలింగ్‌ అవసరమైంది. ఈ రెండు స్థానాలను కూటమి, వైఎస్సార్‌సీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని తీవ్రంగా పోటీపడుతున్నాయి. మంగళవారం పులివెందులలో 76.44 శాతం, ఒంటిమిట్టలో 81.53 శాతం పోలింగ్‌ నమోదు అయింది. ఈనెల 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి మొత్తం 11 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే, ప్రధాన పోటీ మారెడ్డి లతారెడ్డి, హేమంత్‌రెడ్డి మధ్య నెలకొన్నది.