
Revanth Reddy: ఎస్సీ వర్గీకరణ కోసం 60 రోజుల్లో నివేదిక.. జాబ్ నోటిఫికేషన్లపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు దిశగా వేగంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఈ ప్రక్రియలో భాగంగా 60 రోజుల్లో నివేదిక సమర్పించేందుకు ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. తాజా ఉద్యోగ నోటిఫికేషన్లు నివేదిక వచ్చిన తర్వాతే విడుదల చేయాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
2011 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకొని 24 గంటల్లో కమిషన్ ఏర్పాట్లను పూర్తి చేయాలని ఉన్నత అధికారులకు ఆదేశాలను జారీ చేశారు.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణపై కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే.
Details
ఏకసభ్య న్యాయ కమిషన్ ఏర్పాటుకు సిఫార్సు
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే వివిధ అంశాలపై నాలుగు సార్లు సమావేశాన్ని నిర్వహించారు.
ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన న్యాయపరమైన అంశాలను సమీక్షించిన కమిటీ, ఏకసభ్య న్యాయ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం వద్ద సిఫార్సు చేసింది.
ఈ నేపథ్యంలో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి, క్యాబినెట్ సబ్ కమిటీ, ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించి, తక్షణమే కమిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.