Page Loader
House sales: హైదరాబాద్‌లో స్థిరంగా నివాస గృహాల మార్కెట్‌.. 'స్క్వేర్‌ యార్డ్స్‌' నివేదిక 
హైదరాబాద్‌లో స్థిరంగా నివాస గృహాల మార్కెట్‌.. 'స్క్వేర్‌ యార్డ్స్‌' నివేదిక

House sales: హైదరాబాద్‌లో స్థిరంగా నివాస గృహాల మార్కెట్‌.. 'స్క్వేర్‌ యార్డ్స్‌' నివేదిక 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 07, 2025
08:13 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లోని నివాస గృహాల మార్కెట్‌ స్థిరంగా ఉన్నట్లు స్థిరాస్తి కన్సల్టింగ్‌ సేవల సంస్థ 'స్క్వేర్‌ యార్డ్స్‌' తాజా నివేదిక వెల్లడించింది. 2023తో పోల్చితే 2024లో గృహ విక్రయాల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. గత ఏడాదిలో మొత్తం 75,512 ఇళ్లు/ఫ్లాట్లు/విల్లాల అమ్మకాలు జరిగినట్లు నివేదిక తెలిపింది. 2023లో అమ్ముడైన 74,495 గృహాలతో పోల్చితే ఇది 1% అధికం. ఇక విలువపరంగా చూస్తే, 2023లో రూ.39,949 కోట్లు గా ఉన్న మొత్తం గృహ విక్రయ విలువ 13% పెరిగి రూ.45,190 కోట్లకు చేరినట్లు పేర్కొంది.

వివరాలు 

కొనుగోలుదారుల ప్రాధాన్యత, మార్కెట్‌లో మార్పులు 

2023లో అమ్ముడైన గృహాల సగటు విలువ రూ.60 లక్షలు. కొనుగోలుదారులు తమ ఇళ్ల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తూ, అందుబాటులో ఉన్న సమాచారాన్ని పూర్తిగా విశ్లేషించిన తరువాతే నిర్ణయం తీసుకుంటున్నారు. దీని ప్రభావంగా 2024 అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో గృహ విక్రయాలు 18% తగ్గాయి. ఇళ్లు కొనుగోలు చేసే వారి మొగ్గు 1,000-1,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో, రూ.50 లక్షలు-రూ.1 కోటి మధ్య అమ్మక విలువ గల ఇళ్ల కొనుగోలుపై ఎక్కువ ఆసక్తి కనబడుతోంది. పశ్చిమ హైదరాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోల్చితే గృహ ధరలు ఎక్కువగా ఉండటంతో పాటు, అధికంగా క్రయవిక్రయాలు కూడా అక్కడే జరుగుతున్నాయి.

వివరాలు 

భవిష్యత్తులో మార్కెట్ అభివృద్ధి 

సమీప భవిష్యత్తులో గృహ నిర్మాణాలు, క్రయవిక్రయాలు పెరిగే అవకాశముంది. ఐటీ పార్కులు, గ్లోబల్ కెపెబిలిటీ సెంటర్స్ (GCCs), డేటా సెంటర్ల ఏర్పాటు, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు గృహ మార్కెట్‌కు మద్దతుగా ఉంటాయని నివేదిక పేర్కొంది.