Page Loader
YSRCP: రేపల్లెలో వైసీపీకి మూకుమ్మడి రాజీనామాలు.. పార్టీకి గుడ్ బై చెప్పిన మేపిదేవి అనుచరులు
రేపల్లెలో వైసీపీకి మూకుమ్మడి రాజీనామాలు.. పార్టీకి గుడ్ బై చెప్పిన మేపిదేవి అనుచరులు

YSRCP: రేపల్లెలో వైసీపీకి మూకుమ్మడి రాజీనామాలు.. పార్టీకి గుడ్ బై చెప్పిన మేపిదేవి అనుచరులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 12, 2023
06:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గ వైసీసీలో సమన్వయ కర్త మార్పు పెద్ద దుమారమే రేపింది. రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ స్థానంలో డాక్టర్ ఈవూర్ గణేష్‌ను సమన్వయకర్తగా వైసీసీ నియమించింది. ఈ నిర్ణయంపై మోపిదేవి వెంకటరమణ అభిమానులు అగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. మోపిదేవికే సమన్వయకర్త బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. మోపిదేవికి అన్యాయం జరిగిందని రోడ్డుపై రాత్రి టైర్లు తగలబెట్టి నిరసనకు దిగారు. మంగళవారం నియోజకవర్గంలో నామినేట్ పదవులు ఉన్నవారు రేపల్లె కార్యాలయంలో సమావేశమయ్యారు. ఇంచార్జీగా మోపిదేవిని వెంకటరమణనే నియమించాలంటూ మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామా చేశారు.

Details

సమన్వయ కర్త మార్పు నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలి

రాజీనామా చేసిన వారిలో ఛైర్మన్లు, ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పీటీసీలు, మార్కెట్ యార్డు ఛైర్మన్లు, మెంబర్లు ఉన్నారు. రాజీనామా చేసిన వారిలో ఛైర్మన్లు, ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పీటీసీలు, మార్కెట్ యార్డు ఛైర్మన్లు, మెంబర్లు ఉన్నారు. మోపిదేవి వెంకటరమణ 14 ఏళ్లుగా పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నా, ఆయన్ను పక్కన పెట్టడం బాధాకరమని వైసీసీ నేతలు వాపోతున్నారు. సమన్వయ కర్త మార్పు నిర్ణయాన్ని వైసీపీ అదిష్ఠానం వెంటనే పున:సమీక్షించుకోవాలని కోరారు. దీనిపై మోపిదేవి వెంకటరమణ ఇంకా బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.