
యూనిఫాం సివిల్ కోడ్‌కు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ తీర్మానం
ఈ వార్తాకథనం ఏంటి
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలుకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంగళవారం యూసీసీ అమలుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ఇది కేంద్రం తీసుకున్న ఏకపక్ష, తొందరపాటు చర్యగా పినరయి విజయన్ అభివర్ణించారు.
సంఘ్ పరివార్‌కు రాజ్యాంగం అంటే మనుస్మృతి అని విమర్శించారు. వారు మన రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని స్పష్టం చేశారు.
సంఘ్ పరివార్ మనస్సులో ఉన్నది రాజ్యాంగంలో పేర్కొన్న యూసీసీ కాదన్నారు. యూసీసీని అమలు చేయడం వల్ల రాజ్యాంగంలోని లౌకిక లక్షణం ప్రమాదంలో పడుతుందని చెప్పారు.
కేరళ
యూసీసీతో మత స్వేచ్ఛకు భంగం: కేరళ సీఎం
రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 మతపరమైన వ్యక్తిగత నియమాలను అనుసరించే, ఆచరించే హక్కును సూచిందని సీఎం విజయన్ అన్నారు. ఈ ఆర్టికల్ మత స్వేచ్ఛకు హామీ ఇస్తుందని స్పష్టం చేశారు.
యూసీసీని అమలు చేయడం వల్ల ప్రజలు ఈ రాజ్యాంగ హక్కును కోల్పోతారని సీఎం పేర్కొన్నారు.
ఇలాంటి క్లిష్టమైన వాటిలో పౌరుల అభిప్రాయాలను తీసుకోకపోవడం ఆందోళనకరమైన విషయం అన్నారు.
కేరళ అసెంబ్లీలో పినరయి విజయన్ ప్రవేశపెట్టిన తీర్మానికి ప్రతిపక్షాలు కూడా మద్దతు పలికాయి. ఈ తీర్మానాన్ని ఏకగ్రీవరంగా ఆమోదించారు.
అంతేకాదు, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూసీసీ అమలుకు పలు సూచనలను కూడా చేసింది.