Page Loader
Calcutta High Court judge: ఆర్ఎస్ఎస్ వల్లే ఇంతగా ఎదిగా: కోలకత్తా హై కోర్టు న్యాయమూర్తి
ఆర్ఎస్ఎస్ వల్లే ఇంతగా ఎదిగా: కోలకత్తా హై కోర్టు న్యాయమూర్తి

Calcutta High Court judge: ఆర్ఎస్ఎస్ వల్లే ఇంతగా ఎదిగా: కోలకత్తా హై కోర్టు న్యాయమూర్తి

వ్రాసిన వారు Stalin
May 21, 2024
12:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

తన జీవితంలో ఎదుగుదలకు రాష్ట్రీయ స్వయం సేవక్ (RSS) ఎంతో దోహదపడిందని కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి చిత్తరంజన్ దాస్ చెప్పారు. ఆయన సోమవారం నాడు పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా తన అనుభవాలను సహచరులతో పంచుకున్నారు. తనకు బాల్యం నుంచే(RSS) సభ్యత్వం వుండేదన్నారు. దేశ భక్తి, మంచి క్రమశిక్షణ, నిజాయితీ, దేశ భక్తి అక్కడే బీజం పడిందన్నారు. చేసే పని పట్ల శ్రద్ధ తనకు RSS నుంచే వచ్చాయని తెలిపారు.

Details 

ఆర్ఎస్ఎస్ సభ్యుడు కావడం గర్వంగా ఉంది 

తాను సంఘ్ సభ్యుడినని చెప్పడానికి గర్వంగా ఉందన్నారు . అందువల్లే న్యాయమూర్తిగా పని చేసినంతకాలం నిష్పక్ష పాతంగా పని చేగలిగానని తెలిపారు. జడ్జిగా ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ నాడూ RSS వైపు చూడలేదని గుర్తు చేశారు. చట్టం ,ధర్మం పక్షాన నిలిచానే తప్ప కులం, మతం , ప్రాంత వివక్ష చూడలేదని విస్పష్టంగా ప్రకటించారు. తనకు అన్ని పార్టీలు సర్వసమానంగా చూశానని తెలిపారు.

Details 

నిష్పక్ష పాతంగా ఉండటం సంఘ్ నేర్పింది 

కమ్యూనిస్ట్, బిజెపి, తృణమూల్ కు సంబంధించిన కేసులు వస్తే ధర్మం పక్షాన నిలిచానని పేర్కొన్నారు. గత 37 సంవత్సరాలుగా RSS దూరంగా ఉన్నానని గుర్తు చేశారు. ఒడిశాకు చెందిన జస్టిస్ దాస్ 1986 లో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించి క్రమేణా పదోన్నతులు పొందారు. చివరకు కోలకత్తా హైకోర్టు జడ్జిగా పదవీ విరమణ చేశారు. కొద్ది రోజుల క్రితం పదవీ విరమణ చేసిన మరో జడ్జి గంగోపాధ్యాయ ఆ తర్వాత బిజెపిలో చేరి ఎంపీగా పోటీ చేస్తున్నారు.