Page Loader
కర్ణాటకలో ఎన్నికల అధికారులకే షాక్.. దాడి చేసి బ్యాలెట్ పేపర్లు ఎత్తుకెళ్లిన దుండగులు 
దాడి చేసి బ్యాలెట్ పేపర్లు ఎత్తుకెళ్లిన దుండగులు

కర్ణాటకలో ఎన్నికల అధికారులకే షాక్.. దాడి చేసి బ్యాలెట్ పేపర్లు ఎత్తుకెళ్లిన దుండగులు 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 28, 2023
05:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటకలో ఎన్నికల సంఘం అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. సెప్టెంబర్ 27, బుధవారం ఈ ఘటన వెలుగు చూసింది. హుల్లేనహళ్లి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికల నిర్వహణకు రామనగర జిల్లా మాగాడి తాలూకాకు వచ్చిన రిటర్నింగ్ అధికారితో పాటు బృందానికి కొందరు దుండగులు షాక్ ఇచ్చారు. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు అధికారులపై దాడి చేేసి బ్యాలెట్ పేపర్లను దోచుకుని పరారయ్యారు. ఎన్నికల సిబ్బంది చేతుల నుంచి దాదాపు 250 బ్యాలెట్ పేపర్లు, రెండు ల్యాప్‌టాప్‌లను దొంగలించారని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు నలుగురు నిందితులను గుర్తించామని రామనగర ఎస్పీ కార్తీక్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ పనులకు ఆటంకం కలిగించడమే కాకుండా హత్యాయత్నానికి పాల్పడ్డ కారణంగా కేసు నమోదు చేశామన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎన్నికల అధికారులపై దాడి చేసి బ్యాలెట్ పేపర్లు ఎత్తుకెళ్లిన దుండగులు