Page Loader
Revanth Reddy: 'ప్రమాణ స్వీకారానికి రండి'.. తెలంగాణ ప్రజలకు రేవంత్‌ ప్రత్యేక ఆహ్వానం 
Revanth Reddy: 'ప్రమాణ స్వీకారానికి రండి'.. తెలంగాణ ప్రజలకు రేవంత్‌ ప్రత్యేక ఆహ్వానం

Revanth Reddy: 'ప్రమాణ స్వీకారానికి రండి'.. తెలంగాణ ప్రజలకు రేవంత్‌ ప్రత్యేక ఆహ్వానం 

వ్రాసిన వారు Stalin
Dec 06, 2023
06:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా ప్రముఖులను ఆహ్వానించిన రేవంత్ రెడ్డి.. తాజాగా తెలంగాణ ప్రజలను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ప్రజా ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ ప్రజలను రావాలని ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనియాగాంధీ ఉక్కు సంకల్పంతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందిని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణలో మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులతో హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు తాను ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు చెప్పారు. ఈ మహోత్సవానికి రావాల్సిందిగా తెలంగాణ ప్రజలను రేవంత్ రెడ్డి ప్రకటనలో కోరారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రేవంత్ రెడ్డి ట్వీట్