Page Loader
Revanth Reddy: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి నియామకం
Revanth Reddy: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి నియామకం

Revanth Reddy: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి నియామకం

వ్రాసిన వారు Stalin
Dec 05, 2023
08:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది ఎట్టకేలకు తేలింది. పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డిని సీఎంగా ఎంపిక చేసినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ ప్రకటించారు. ఈ మేరకు దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. తెలంగాణ ఎన్నికల పరిశీలకుడు డీకే శివకుమార్‌, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్క సమక్షంలో వేణుగోపాల్‌ ఈ ప్రకటన చేశారు. తెలంగాణలోని రాజకీయ పరిణామాలు, సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్‌ను సీఎల్పీ నేతగా ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఈ నెల 7న ఉదయం 11గంటలకు మంచి ముహూర్తం ఉండటంతో అదేరోజు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రేవంత్ రెడ్డి ట్వీట్