LOADING...
Revanth Reddy: మొంథా ప్రభావం అధికంగా ఉన్న జిల్లాలల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం
మొంథా ప్రభావం అధికంగా ఉన్న జిల్లాలల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం

Revanth Reddy: మొంథా ప్రభావం అధికంగా ఉన్న జిల్లాలల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2025
05:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

మొంథా తుపాన్ తీవ్ర వాయుగుండంగా మారి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వాయుగుండం పరిస్థితిపై ముఖ్యమంత్రి సంబంధిత అధికారులతో చర్చించి పూర్తి వివరాలు తెలుసుకుని, అవసరమైన సూచనలు చేశారు. ప్రస్తుతం వరి కోతల సీజన్‌ కొనసాగుతుండగా, రైతులు ఆరబోస్తున్న ధాన్యం నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అదేవిధంగా, పత్తి, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తగిన రక్షణ ఏర్పాట్లు చేయాలని సూచించారు.

వివరాలు 

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో తుపాను తీవ్రత ఎక్కువగా ఉండగా, హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లోనూ వర్షాలు విస్తారంగా పడుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి శాఖ సిబ్బంది, అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ, అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ వద్ద గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ మరియు గుండ్రాతిమడుగు వద్ద కోణార్క్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోవడంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు మార్గం మళ్లించిన నేపథ్యంలో, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు.

వివరాలు 

నీటి విడుదలపై ముందస్తుగా కలెక్టర్లకు సమాచారం ఇవ్వాలి 

తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సమన్వయంతో పని చేయాలని, కలెక్టర్లు ఆ బృందాలకు తగిన మార్గదర్శకత్వం ఇవ్వాలని ఆదేశించారు. వాగులు, వంకలు పొంగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించారు. నీటి పారుదల శాఖ అధికారులు చెరువులు, కుంటలు, రిజర్వాయర్ల నీటి మట్టాన్ని తరచూ పరిశీలించి, నీటి విడుదలపై ముందస్తుగా కలెక్టర్లకు సమాచారం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. పూర్తిగా నిండిన చెరువుల వద్ద ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో,తక్కువ ఎత్తులో ఉన్న వంతెనలు, కాజ్‌వేలపై రాకపోకలను నిలిపివేయాలని, పోలీసులు,రెవెన్యూ అధికారులు అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని ఆయన ఆదేశించారు.

వివరాలు 

పురపాలక, గ్రామ పారిశుద్ధ్య సిబ్బంది తరచుగా శుభ్రత కార్యక్రమాలు చేపట్టాలి

రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, తక్కువ ఎత్తులో ఉన్న వంతెనలు, కాజ్‌వేలపై రాకపోకలను నిలిపివేయాలని, పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని ఆయన ఆదేశించారు. తుపాను ప్రభావంతో వర్షపు నీరు నిలిచిపోవడం వల్ల దోమలు, క్రిమికీటకాలు పెరగే అవకాశం ఉందని, పురపాలక, గ్రామ పారిశుద్ధ్య సిబ్బంది తరచుగా శుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా, వైద్యారోగ్య శాఖ తగిన మందులను సిద్ధంగా ఉంచి, అవసరమైతే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

వివరాలు 

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై హైడ్రా, జీహెచ్ఎంసీ వెంటనే స్పందించాలన్న ముఖ్యమంత్రి 

ప్రాణనష్టం, ఆస్తినష్టం, పశునష్టం జరగకుండా ప్రతి శాఖ జాగ్రత్తలు వహించాలన్నారు. రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్‌, ఆర్ అండ్ బీ, వైద్యారోగ్య, పోలీసులు, అగ్నిమాపక, ఎస్డీఆర్‌ఎఫ్‌ శాఖల సిబ్బంది సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అలాగే హైదరాబాద్ నగరంలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతులకు జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక శాఖలు వెంటనే స్పందించాలని సూచించారు.