Page Loader
Revanth Reddy: 'సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి'.. నెలరోజుల పాలనపై రేవంత్ రెడ్డి ట్వీట్ 
Revanth Reddy: సీఎంగా నెలరోజుల పాలనపై రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్

Revanth Reddy: 'సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి'.. నెలరోజుల పాలనపై రేవంత్ రెడ్డి ట్వీట్ 

వ్రాసిన వారు Stalin
Jan 07, 2024
12:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రెండో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి.. ఆదివారానికి నెల రోజులు అయింది. ఈ నెల రోజుల్లో తనదైన పాలనతో రేవంత్ రెడ్డి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. నెలరోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ... పాలనను ప్రజలకు చేరువ చేస్తూ...అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చింది' అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రేవంత్ రెడ్డి ట్వీట్