LOADING...
Revanth Reddy: రాష్ట్ర సమాచార హక్కు కొత్త లోగోను ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి
రాష్ట్ర సమాచార హక్కు కొత్త లోగోను ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి

Revanth Reddy: రాష్ట్ర సమాచార హక్కు కొత్త లోగోను ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 06, 2025
04:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు (ఆర్టీఐ) కమిషన్‌కు కొత్త లోగో వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఈ నూతన లోగోను ఆవిష్కరించారు ఈ కార్యక్రమం 20వ జాతీయ ఆర్టీఐ వారోత్సవాలను సందర్భంగా జరిగింది. అదే సమయంలో, రాష్ట్ర సమాచార కమిషన్ బృందం ముఖ్యమంత్రిని మర్యాదగా కలిసింది. ఈ కార్యక్రమానికి ఆర్టీఐ చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో కమిషన్ బృందం హాజరయ్యింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు కొత్తగా నియమితులైన కమిషనర్లు.. బోరెడ్డి అయోధ్యరెడ్డి, పీవీ శ్రీనివాసరావు, మొహిసినా పర్వీన్, దేశాల భూపాల్, మెర్ల వైష్ణవి.. పాల్గొన్నారు.

వివరాలు 

నలుగురు కొత్త కమిషనర్ల నియామకానికి ఆదేశాలు జారీ 

గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో సమాచార హక్కు కమిషన్‌లో పలు పోస్టులు ఖాళీగా ఉండగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వమే వీటిని త్వరగా భర్తీ చేసింది. ఈ నేపథ్యంలో, నలుగురు కొత్త కమిషనర్ల నియామకానికి ఆదేశాలు జారీ చేయబడ్డాయి. బాధ్యతలు స్వీకరించిన కొత్త కమిషనర్ల బృందం ప్రధానమంత్రి ని కలవడం ఈ కార్యక్రమానికి ప్రధాన విశేషంగా నిలిచింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సమాచార హక్కు చట్టం వారోత్సవాల సందర్బంగా కొత్త లోగో ఆవిష్కరణ..