Revanthreddy: మూసీ సుందరీకరణ కాదు.. మూసీ నది పునరుజ్జీవం: రేవంత్ రెడ్డి
ఈ వార్తాకథనం ఏంటి
"మేము చేపడుతున్నది మూసీ సుందరీకరణ కాదు, మూసీ నది పునరుజ్జీవనం" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో, మూసీ నది అభివృద్ధి, సుందరీకరణ ప్రాజెక్టు గురించి వివరాలు వెల్లడించారు.
"మూసీ దుర్గంధంతో బాధపడుతున్న ప్రజలకు మెరుగైన జీవనం అందించడానికి ఈ ప్రాజెక్టు ప్రారంభించాం.నగర కేంద్రంలో నుంచి వెళ్లే నది ఇదే దేశంలో మరొకటి లేదు.దాదాపు 300 కి.మీ మేర ప్రవహించే మూసీకి గొప్ప చరిత్ర,విశిష్టత ఉంది.మేము చేపడుతున్నది మూసీ సుందరీకరణ కాదు, మూసీ నది పునరుజ్జీవనమే. కొందరు స్మృతిలో ఉన్న మురికిని కంటే ఎక్కువ విషాన్ని నింపుకున్నారు. మెదడులో విషం నింపి, మూసీ ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నారు."
వివరాలు
రాత్రికి రాత్రే పోలీసులు కొట్టించి గుర్రాలతో తొక్కించి..
మూసీ పరివాహక ప్రజలకు మంచి జీవితం ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు.మల్లన్న సాగర్,వేమలఘాట్లో జరిగిన విషయాలను గుర్తుచేస్తూ,"రాత్రికి రాత్రే పోలీసులు కొట్టించి గుర్రాలతో తొక్కించి ఖాళీ చేయించడం మేము చేయట్లేదు. రంగనాయక్ సాగర్, కొండపోచమ్మ వంటి ప్రాజెక్టులకు నేను వస్తాను," అని అన్నారు.
వివరాలు
నిర్వాసితులకు రెండు పడక గదుల ఇళ్లు,రూ.25వేలు
"ఈ రోజున, మూసీ నది కాలుష్యానికి ప్రతీకగా మారింది. 1600కి పైగా నివాసాలు పూర్తిగా మూసీ నదిలో మునిగిపోయాయి. మల్లన్నసాగర్లో మునిగిపోయిన 14గ్రామాల్లో ఎలా వ్యవహరించారో తెలుసా? మేము ఉన్నపళంగా, నిర్దయగా ఎవరినీ ఖాళీ చేయించలేదు. నిర్వాసితులకు రెండుపడక గదుల ఇళ్లు కేటాయించి, రూ. 25వేలు అందించాం. చెరువుల్లో అక్రమంగా నిర్మించిన భవనాలను మాత్రమే హైడ్రా కూల్చింది. మూసీ పరివాహకంలో ఎవరి ఇళ్లను హైడ్రా కూల్చలేదు.చినుకు పడితే, హైదరాబాద్లో గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతోంది.రోడ్లపై పడిన వర్షపు నీరు చెరువుల్లోకి,నదుల్లోకి చేరాలా, లేక రోడ్లపై ఉండాలా?" అని సీఎం ప్రశ్నించారు.