LOADING...
Reverification of EVMs:ఒంగోలు నియోజకవర్గంలో ఈవీఎంల రీవెరిఫికేషన్.. 12 పోలింగ్ బూత్‌లపై అనుమానాలు 
ఒంగోలు నియోజకవర్గంలో ఈవీఎంల రీవెరిఫికేషన్.. 12 పోలింగ్ బూత్‌లపై అనుమానాలు

Reverification of EVMs:ఒంగోలు నియోజకవర్గంలో ఈవీఎంల రీవెరిఫికేషన్.. 12 పోలింగ్ బూత్‌లపై అనుమానాలు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 19, 2024
11:46 am

ఈ వార్తాకథనం ఏంటి

ఒంగోలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇప్పటికే వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అయితే ఒంగోలులో 26 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇందులో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్ధన్ 34060 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీనిపై బాలినేని శ్రీనివాసులు అనుమానం వ్యక్తం చేశారు. ఏకంగా 12 బూత్‌లపై రీవెరిఫికేషన్ నిర్వహించాలంటూ శ్రీనివాసులరెడ్డి 5లక్షల 66 వేల రూపాయలు చెల్లించారు.

Details

ప్రతినిధుల సమక్షంలో వెరిఫికేషన్

దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశామని కలెక్టెర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. ఇవాళ అభ్యర్థులు లేదా వారి ప్రతినిధుల సమక్షంలో జిల్లా అధికారులు వెరిఫికేషన్ చేపట్టనున్నారు. బెల్ ఇంజినీర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. ఒంగోలులోని భాగ్యనగర్ గౌడౌన్‌లో ఈవీఎంలు భద్రపరిచారు. అక్కడే ఈ మాక్ పోలింగ్ జరగనుంది. నియోజకవర్గంలోని.. 6, 26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256 పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఈవీఎంలకు ఇప్పుడు రీవెరిఫికేషన్‌లో భాగంగా మాక్‌పోలింగ్‌ చేయనున్నారు.