NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: క్యాట్‌లో ఐఏఎస్ అధికారుల సవాల్.. డీవోపీటీ ఆదేశాలను తక్షణమే రద్దు చేయాలని అభ్యర్థన
    తదుపరి వార్తా కథనం
    Telangana: క్యాట్‌లో ఐఏఎస్ అధికారుల సవాల్.. డీవోపీటీ ఆదేశాలను తక్షణమే రద్దు చేయాలని అభ్యర్థన
    క్యాట్‌లో ఐఏఎస్ అధికారుల సవాల్.. డీవోపీటీ ఆదేశాలను తక్షణమే రద్దు చేయాలని అభ్యర్థన

    Telangana: క్యాట్‌లో ఐఏఎస్ అధికారుల సవాల్.. డీవోపీటీ ఆదేశాలను తక్షణమే రద్దు చేయాలని అభ్యర్థన

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 14, 2024
    04:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఆదేశాలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులను పునర్విభజన చట్టం ప్రకారం కేటాయించిన రాష్ట్రాలకు మళ్లించాలని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ (డీఓపీటీ) ఆదేశించింది.

    ఈ విషయాన్ని డీఓపీటీ కార్యదర్శి అధికారికంగా ప్రకటించారు. డీఓపీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ కొంతమంది ఐఏఎస్‌ అధికారులు క్యాట్‌ను ఆశ్రయించారు.

    డీవోపీటీ ఉత్తర్వులను రద్దు చేయాలని వాకాటి కరుణ, వాణి ప్రసాద్‌, ఆమ్రపాలి, సృజన అనే ఐఏఎస్‌ అధికారులు వేర్వేరుగా పిటిషన్‌లు దాఖలు చేశారు.

    తెలంగాణలో కొనసాగేందుకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని వాకాటి కరుణ, వాణీ ప్రసాద్‌, ఆమ్రపాలి కోరారు.

    Details

    మంగళవారం విచారణ

    అయితే ఏపీ పరిధిలోనే కొనసాగాలని ఐఏఎస్‌ అధికారిణి సృజన కోరారు. ఈ పిటిషన్లపై కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ మంగళవారం విచారణ చేపట్టనుంది.

    ఏపీకి కేటాయించి తెలంగాణలో కొనసాగుతున్న ఐఏఎస్‌ అధికారుల్లో వాణీ ప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్‌ రోస్, ఆమ్రపాలి, ప్రశాంతి ఉన్నారు.

    ఐపీఎస్‌ అధికారులు అంజనీకుమార్, అభిలాష్‌ బిస్త్, అభిషేక్‌ మహంతి కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణకు రావాల్సిన ఐఏఎస్‌ అధికారుల్లో సృజన, శివశంకర్, హరికిరణ్‌ ఉన్నారు.

    ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లాలని దరఖాస్తు చేసుకున్న ఎస్‌.ఎస్‌.రావత్, అనంతరాము అభ్యర్థనలను డీవోపీటీ తిరస్కరించింది. దీంతో వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్‌లోనే కొనసాగనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్
    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ

    తెలంగాణ

    Gandhi Temple: నిత్యం ధూప, దీప, నైవేద్యాలు పెట్టే ఈ గుడి స్పెషల్ ఏంటో తెలుసా..? ఇది ఎక్కడ ఉందొ తెలుసా? మహాత్మా గాంధీ
    Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృవియోగం ఉత్తమ్ కుమార్‌రెడ్డి
    Ponnam Prabhakar: ఆర్టీసీలో 3వేల కొత్త ఉద్యోగాల భర్తీపై మంత్రి పొన్నం కీలక ప్రకటన కరీంనగర్
    DSC Results 2024: నేడు తెలంగాణ డీఎస్సీ ఫలితాలు.. సచివాలయంలో విడుదల చేయనున్న సీఎం.. భారతదేశం

    ఆంధ్రప్రదేశ్

    Anantapuram: అనంతపురం జిల్లాలో రథం దగ్ధం.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు.. చంద్రబాబు నాయుడు
    AP Govt: ఏపీలో నామినేటెడ్ పోస్టులు భర్తీ.. జాబితాను ప్రకటించిన కూటమి ప్రభుత్వం తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    Andhrapradesh: ఖరీఫ్ సీజన్‌ ధాన్యం కొనుగోళ్లపై ఏపీ ప్రభుత్వం గైడ్ లైన్స్ భారతదేశం
    Manta Parvathamma: టీడీపీ ఎంపీ ఇంట పెను విషాదం.. మాజీ ఎంపీ కన్నుమూత ప్రకాశం జిల్లా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025