RG Kar rape-murder case: కేసు పోలీసుల చేతుల్లో ఉంటే.. సంజయ్‌కు జైలు శిక్షపై మమతా బెనర్జీ అసంతృప్తి
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఆర్జీకర్ ఆస్పత్రి వైద్యురాలిపై హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్ కు న్యాయస్థానం జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే.
ఈ తీర్పుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈ తీర్పుపై ఆమె తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
వివరాలు
కేసు పోలీసుల చేతుల్లో ఉంటే..
''జూనియర్ వైద్యురాలికి జరిగిన హత్యాచార ఘటనపై దోషికి మరణశిక్ష విధించాలనే డిమాండ్‌ను మేమంతా చేశాం,కానీ అది జరిగలేదు. ఈ కేసును బెంగాల్ పోలీసులు బలవంతంగా నుంచి సీబీఐకి బదిలీ చేశారు.ఈ కేసును బెంగాల్ పోలీసుల ఆధీనంలోనే వుంచినప్పుడు,వారు తప్పకుండా దోషికి మరణశిక్ష విధించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారనే నా అభిప్రాయం.విచారణ ఎలా జరిగింది అనేది నాకు స్పష్టంగా తెలియదు. రాష్ట్ర పోలీసులు ఈ తరహా అనేక కేసుల్లో మరణశిక్షను అమలు చేశారు. ప్రస్తుత తీర్పు మాత్రం నా వద్ద సంతృప్తికరంగా లేదు''అని మమతా బెనర్జీ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, గత ఏడాది ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆర్జీకర్ ఆసుపత్రి సెమినార్ రూమ్‌లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన జరిగింది.
వివరాలు
శిక్ష అమలుకు ముందు,సంజయ్ వాదనలు
ఈ ఘటన ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసును మొదట బెంగాల్ పోలీసులు దర్యాప్తు చేసినప్పటికీ, తరువాత సీబీఐకి బదిలీ చేయడం జరిగింది.
ఈ దర్యాప్తు తర్వాత ప్రత్యేక కోర్టుకు అభియోగాలు సమర్పించబడ్డాయి.
ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పేరును మాత్రమే ఛార్జ్‌షీట్‌లో చేర్చారు.
ఆసుపత్రి ఆవరణంలో సీసీటీవీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా,కోల్‌కతా పోలీసులు ఆగస్టు 10న సంజయ్‌ను అరెస్ట్ చేశారు.
సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత,న్యాయస్థానం అతన్ని దోషిగా తేల్చింది.
శిక్ష అమలుకు ముందు,సంజయ్ తన వాదనలు వినిపించాడు. తాను ఏ నేరం చేయలేదని ఏ కారణం లేకుండానే తనను ఇందులో ఇరికించారని అన్నాడు.