Page Loader
Nagarjuna Sagar: సాగర్‌కు పెరుగుతున్న వరద నీరు.. 520 అడుగులకు చేరిన నీటిమట్టం
సాగర్‌కు పెరుగుతున్న వరద నీరు.. 520 అడుగులకు చేరిన నీటిమట్టం

Nagarjuna Sagar: సాగర్‌కు పెరుగుతున్న వరద నీరు.. 520 అడుగులకు చేరిన నీటిమట్టం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 04, 2025
01:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

నాగార్జునసాగర్‌ జలాశయానికి పైప్రాంతాల నుంచి వరద నీరు భారీగా వస్తుండటంతో, జలాశయంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా సాగర్‌కు రోజుకు 51,373 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ఈ పరిస్థితుల్లో సాగర్‌ జలాశయం నుంచి ఎస్‌ఎల్‌బీసి ద్వారా కేవలం 900 క్యూసెక్కుల నీటినే విడుదల చేస్తున్నారు. సాధారణంగా సాగర్‌ గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులుగా ఉండగా, గురువారం నాటికి ఇది 520.10 అడుగులకు పెరిగింది. మొత్తం నిల్వ సామర్థ్యం 312.045 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అందులో 149.458 టీఎంసీల నీరు ఉంది. గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆగస్టు తొలి వారంలో సాగర్‌ కాల్వల ద్వారా నీటిని విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.