LOADING...
Krishna River: శ్రీశైలం ప్రాజెక్టులో భారీ వరద.. నీటి నిల్వ 199.73 టీఎంసీ  
శ్రీశైలం ప్రాజెక్టులో భారీ వరద.. నీటి నిల్వ 199.73 టీఎంసీ

Krishna River: శ్రీశైలం ప్రాజెక్టులో భారీ వరద.. నీటి నిల్వ 199.73 టీఎంసీ  

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 22, 2025
09:48 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎగువ ప్రాంతాల్లో కురిసిన తీవ్రమైన వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టులో భారీ వరద కొనసాగుతోంది. జూరాలు,సుంకేసులు నుండి నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతూ ఉంది. ప్రాజెక్టు జలాశయంలో ఇప్పటి వరకు ఇన్‌ఫ్లో 5,40,756 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 5,16,493 క్యూసెక్కుల వద్ద ఉంది. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్ ద్వారా 30,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అదనంగా,ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రం నుండి 35,315 క్యూసెక్కులు,కుడిగట్టు విద్యుత్‌ కేంద్రం నుండి 29,648 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు నుంచి విడుదల అవుతోంది. 10 స్పిల్‌వే గేట్ల ద్వారా 4,21,530 క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్‌ జలాశయానికి ప్రవహిస్తున్నది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం 882.10అడుగులకు చేరగా, ప్రాజెక్టులోని మొత్తం నీటి నిల్వ 199.73 టీఎంసీలుగా కొనసాగుతోంది.