LOADING...
Mumbai: ముంబై మేయర్‌గా రీతూ తాన్డే.. డిప్యూటీ మేయర్‌గా సంజయ్‌ ఘడి
ముంబై మేయర్‌గా రీతూ తాన్డే.. డిప్యూటీ మేయర్‌గా సంజయ్‌ ఘడి

Mumbai: ముంబై మేయర్‌గా రీతూ తాన్డే.. డిప్యూటీ మేయర్‌గా సంజయ్‌ ఘడి

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 07, 2026
12:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముంబై మున్సిపల్‌ ఎన్నికలు ముగిసి దాదాపు నెల రోజులు గడిచినా మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎంపికపై కొనసాగిన ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధించినప్పటికీ, కీలక పదవుల విషయంలో బీజేపీ-శివసేన (ఏక్‌నాథ్‌ షిండే వర్గం) మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యంగా మేయర్‌ పదవిపై శివసేన కన్నేయగా, చివరకు ఆ పదవిని బీజేపీ సొంతం చేసుకుంది. డిప్యూటీ మేయర్‌ పదవిని శివసేనకు కేటాయిస్తూ ఇరు పార్టీల మధ్య చర్చలు ఫైనల్‌ అయ్యాయి. ఈ ఒప్పందం ప్రకారం మేయర్‌గా బీజేపీకి చెందిన రీతూ తాన్డే ఎన్నికైనట్లు సమాచారం. డిప్యూటీ మేయర్‌గా ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి చెందిన సంజయ్‌ ఘడికి అవకాశం దక్కింది.

Details

గతంలో విద్యా కమిటీ ఛైర్మన్ గా పనిచేసిన అనుభవం

రీతూ తాన్డే బీజేపీలో సీనియర్‌ నాయకురాలిగా గుర్తింపు పొందారు. ఇటీవల జరిగిన బృహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) ఎన్నికల్లో గహత్కోపర్‌ నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందారు. ఇదే నియోజకవర్గం నుంచి ఆమె మూడుసార్లు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. గతంలో విద్యా కమిటీ ఛైర్మన్‌గా కూడా పని చేసిన అనుభవం ఆమెకు ఉంది. ఈ అనుభవం బీఎంసీ అభివృద్ధికి ఉపయోగపడుతుందన్న అంచనాతో బీజేపీ ఆమె పేరును మేయర్‌ పదవికి ప్రతిపాదించింది. పార్టీ హైకమాండ్‌తో చర్చించిన అనంతరం రీతూ తాన్డే నియామకానికి ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో డిప్యూటీ మేయర్‌గా దహిసర్‌ కౌన్సిలర్‌, ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి చెందిన సంజయ్‌ ఘడి ఎన్నికయ్యారు. ఈ నిర్ణయంతో ముంబై మున్సిపల్‌ పాలనలో బీజేపీ-శివసేన మధ్య అధికార పంపకం స్పష్టమైంది.

Advertisement