తదుపరి వార్తా కథనం

USA Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు ప్రవాస భారతీయులు దుర్మరణం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 16, 2024
09:12 am
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో టెక్సాస్‌లోని రాండాల్ఫ్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రవాస భారతీయులు దుర్మరణం చెందారు.
ఈ ప్రమాదంలో ఒక మహిళతో సహా ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వారు ఉన్నారు.
రహదారి పైకి దక్షిణ బాన్‌హామ్‌కు ఆరు మైళ్ల దూరంలో సాయంత్రం 6:45 గంటలకు (అమెరికా కాలమానం) రెండు వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు టెక్సాస్ పబ్లిక్ సేఫ్టీ విభాగం పేర్కొంది.
ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నట్లు అక్కడి ప్రవాస భారతీయ సంఘాలు తెలియజేశాయి.
ఈ ప్రమాదాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లినట్లు వారు తెలిపారు.