Andhra news: రైల్వే భద్రతకు కొత్త రూపం: విశాఖలో రోబో కాప్ ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
రైల్వేశాఖలో తొలిసారిగా విశాఖపట్టణం రైల్వే స్టేషన్‌లో'రోబో కాప్'ను సేవల్లోకి తీసుకొచ్చారు. గురువారం ఈ రోబోను ఆర్పీఎఫ్ ఐజీ అలోక్ బోహ్రా,డీఆర్‌ఎం లలిత్ బోహ్రా అధికారికంగా ప్రారంభించారు. కృత్రిమ మేధస్సు(ఏఐ),ఐఓటీ సాంకేతికతలతో రూపొందిన ఈరోబో స్టేషన్ పరిసరాల్లో నిరంతరం గస్తీ నిర్వహిస్తూ అనుమానాస్పద వ్యక్తులను గుర్తించగలుగుతుంది. తరచూ దొంగతనాలకు పాల్పడే వారి ఫొటోలు తీసి విశ్లేషణ చేయడం ద్వారా వారిని గుర్తించడంలో రైల్వే పోలీసులకు ఇది సహకరిస్తుంది. అలాగే స్టేషన్‌లో రద్దీ ఎక్కువైనప్పుడు ప్రయాణికులను అప్రమత్తం చేసే విధంగా పనిచేస్తుంది. విశాఖకు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ తయారు చేసిన ఈ రోబోకు రైల్వే పోలీసులు'ఏఎస్‌సీ అర్జున్'అనే పేరు పెట్టారు. ఈ కార్యక్రమంలో డివిజినల్ సెక్యూరిటీ కమాండెంట్ ఏకేదుబేతో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఏఎస్‌సీ అర్జున్ ఆన్ డ్యూటీ సర్!
దేశంలోనే తొలిసారి.. విశాఖ రైల్వే స్టేషన్‌లో రోబో కాప్#robocop #indianrailways #visakhapatnam pic.twitter.com/szf2B3xBAa
— News18 Telugu (@News18Telugu) January 23, 2026