LOADING...
Kerala: త్రిసూర్ ఆలయంలో రోబోటిక్‌ ఏనుగు
త్రిసూర్ ఆలయంలో రోబోటిక్‌ ఏనుగు

Kerala: త్రిసూర్ ఆలయంలో రోబోటిక్‌ ఏనుగు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 15, 2026
01:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేరళ రాష్ట్రంలోని ఒక ఆలయానికి జంతు సంక్షేమ సంస్థ పెటా ఇండియా,అనితా డోంగ్రే ఫౌండేషన్ కలిసి భారీ రోబోటిక్‌ ఏనుగును బహుమతిగా అందించాయి. త్రిసూర్ ప్రాంతంలో ఉన్న శ్రీభద్రకాళీ విష్ణుమాయా ఆలయానికి "పున్నక్కపరంబిల్ మహాదేవన్" అనే పేరుతో ఈ రోబోటిక్‌ ఏనుగును అందజేసినట్లు పెటా వెల్లడించింది. మలయాళ నూతన సంవత్సరమైన విషు పండుగ సందర్భంగా భక్తుల సమక్షంలో దీనిని ఆవిష్కరించినట్లు తెలిపింది.

వివరాలు 

దేశంలోని పలు ఆలయాలకు మొత్తం ఇరవై ఐదు రోబోటిక్‌ ఏనుగులు 

ఆలయంలో జరిగే వేడుకల సమయంలో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా, సురక్షితంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ రోబోటిక్‌ ఏనుగును వినియోగించనున్నట్లు పేర్కొంది. కేరళ వ్యాప్తంగా వివిధ ఆలయాలకు పెటా అందించిన రోబోటిక్‌ ఏనుగుల్లో "పున్నక్కపరంబిల్ మహాదేవన్" పద్నాలుగవది. ఇప్పటివరకు దేశంలోని పలు ఆలయాలకు మొత్తం ఇరవై ఐదు రోబోటిక్‌ ఏనుగులను బహుమతిగా అందించినట్లు పెటా సంస్థ తెలిపింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సురక్షిత వేడుకల కోసం ఆలయానికి కొత్త రోబోటిక్‌ ఏనుగు

Advertisement