LOADING...
AP Roads: వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రూ.1000 కోట్లు.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

AP Roads: వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రూ.1000 కోట్లు.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 08, 2025
04:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రహదారుల మరమ్మతుల కోసం భారీ నిధులను మంజూరు చేసింది. రాష్ట్రంలో రోడ్లను మరమ్మతు చేయడానికి మొత్తం రూ. 1,000 కోట్లనిధులను కేటాయించడం జరిగింది. ఈ నిధులు 274 ప్రధాన రహదారుల మరమ్మతులకు వినియోగించే విధంగా నిర్ణయించబడినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ అంశంపై పాలనాపరమైన అనుమతులను మంజూరు చేస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రకారం, రాష్ట్రంలో ముఖ్యమైన రహదారులలో పనులను చేపట్టడానికి ప్రత్యేక విభాగాలుగా నిధులు కేటాయించబడ్డాయి. వివరాల ప్రకారం, స్టేట్‌ హైవేస్‌ లో 108 రహదారుల మరమ్మతుల కోసం రూ. 400 కోట్లను కేటాయించారు. అలాగే, జిల్లా రోడ్లలో 166 రహదారుల మరమ్మతులకు రూ. 600 కోట్లు మంజూరు చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు 1000 కోట్లు నిధులు మంజూరు