RBI: రూ.1000 నోటు రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ
కేంద్ర ప్రభుత్వం ఇటీవల అతిపెద్ద కరెన్సీ నోటు రెండు వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాత పెద్ద నోట్లు తిరిగి చలామణిలోకి రానున్నాయని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. పెద్ద నోట్లు లేకపోవడంతో గతంలో రద్దు చేసిన రూ.1000 నోటును తిరిగి ప్రవేశపెట్టనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఊహగాహనాలపై ఆర్బీఐ స్పష్టతనిచ్చినట్లు తెలుస్తోంది. రూ.1000 కరెన్సీ నోట్లను మళ్లీ ప్రవేశపెట్టే అంశాన్ని ఆర్‌బీఐ పరిగణనలోకి తీసుకోలేదని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ ఏడాది మే19న 2వేల కరెన్సీ నోట్లను చెలామణి నుంచి తొలగిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించి, నోట్ల మార్పడికి నాలుగు నెలల గడువును ఇచ్చింది.
రూ.1000 నోట్ల కరెన్సీని పరిగణలోకి తీసుకొని ఆర్బీఐ
ఉగ్రవాదం అరికట్టడమే లక్ష్యంగా నవంబర్ 8, 2016న ప్రధాని మోదీ 500, రూ.1000 కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే 2వేల నోట్లను చెలామణి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి రూ.1000 నోట్లను మళ్లీ ప్రవేశపెట్టవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇక 1000 నోట్లను మళ్లీ ప్రవేశపెట్టే అంశాన్ని ఆర్‌బీఐ పరిగణించడం లేదని పలు నివేదికలు స్పష్టం చేశాయి.