LOADING...
AP Vahanamitra Scheme: ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేల సాయం.. నేటి నుంచే దరఖాస్తులు!
ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేల సాయం.. నేటి నుంచే దరఖాస్తులు!

AP Vahanamitra Scheme: ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేల సాయం.. నేటి నుంచే దరఖాస్తులు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 17, 2025
09:33 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో ఆటోడ్రైవర్ల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 'వాహన మిత్ర' పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి, ప్రతి ఏడాదీ రూ.15 వేల ఆర్థిక సాయం అందజేయనుంది. ఈ పథకానికి సంబంధించిన కొత్త దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభమైంది. ఇది సెప్టెంబర్ 19 వరకు కొనసాగుతుంది. ఇటీవలే ఏపీ ప్రభుత్వం ఆటోడ్రైవర్లకు గుడ్‌న్యూస్ అందించింది. దసరా కానుకగా ఈ పథకం కింద లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమ చేయనుంది. అర్హులైన ప్రతి ఆటోడ్రైవర్‌కి సంవత్సరానికి ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున సాయం లభిస్తుంది.

Details

దరఖాస్తు ప్రక్రియ 

దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు గ్రామ/వార్డు సచివాలయాన్ని సంప్రదించాలి. ఇప్పటికే అప్లికేషన్ ఫారమ్ అందుబాటులో ఉంది. దరఖాస్తులో ఈ వివరాలను నమోదు చేయాలి దరఖాస్తుదారుని పేరు, తండ్రిపేరు ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ కులం-ఉపకులం, కుల ధృవీకరణ పత్రం నెంబర్ బ్యాంకు అకౌంట్ నెంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, బ్రాంచ్ పేరు ఆదాయ ధృవీకరణ పత్రం నెంబర్, ఆదాయం చిరునామా వాహన రకం (ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్) వాహన గుర్తింపు సంఖ్య, చెల్లుబాటు అయ్యే తేదీ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, జారీ చేసిన తేదీ

Details

తదుపరి షెడ్యూల్

అప్లికేషన్లు స్వీకరించే చివరి తేదీ: సెప్టెంబర్ 19 క్షేత్ర స్థాయి పరిశీలన: సెప్టెంబర్ 22 లోపు ఫైనల్ లిస్ట్ విడుదల: సెప్టెంబర్ 24 లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ: అక్టోబర్ 1 అర్హతలు సొంత వాహనం కలిగి, దాన్నే నడిపే డ్రైవర్లకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. వాహనం తప్పనిసరిగా రాష్ట్ర పరిధిలోనే రిజిస్టర్ అయి ఉండాలి. మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్‌ల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, వెహికిల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. * బీపీఎల్ కుటుంబానికి చెందిన వారు కావాలి, రేషన్ కార్డు ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు దరఖాస్తు చేసుకోలేరు. వాహనానికి ఎటువంటి పెండింగ్ బకాయిలు, చలాన్లు ఉండరాదు

Details

భూమి, ఆస్తి పరిమితులు

మాగాణి భూమి మూడు ఎకరాల లోపు, మెట్ట భూమి పది ఎకరాల లోపు ఉండాలి. రెండూ కలిపి గరిష్ఠంగా పది ఎకరాలు మించరాదు. పట్టణాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నివాస లేదా వాణిజ్య నిర్మాణం ఉండరాదు. ఈ నిబంధనలు పాటించే ఆటోడ్రైవర్లకు మాత్రమే ఏపీ ప్రభుత్వం వాహన మిత్ర పథకం కింద సంవత్సరానికి రూ.15 వేల ఆర్థిక సాయం అందించనుంది.