Page Loader
BDCC Bank: కర్ణాటకలోని సహకార బ్యాంకులో దోపిడీ.. బ్యాంక్ కస్టమర్ల ఖాతాల్లో నుంచి రూ.2.3 కోట్లు చోరీ
కర్ణాటకలోని సహకార బ్యాంకులో రూ.2.3 కోట్లు దోపిడీ

BDCC Bank: కర్ణాటకలోని సహకార బ్యాంకులో దోపిడీ.. బ్యాంక్ కస్టమర్ల ఖాతాల్లో నుంచి రూ.2.3 కోట్లు చోరీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 24, 2025
11:15 am

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక రాష్ట్రంలోని విజయనగరలోని ఓ సహకార బ్యాంకులో సైబర్ నేరగాళ్లు రూ.2.34 కోట్లు దోచుకున్నారు. 2025 జనవరి 10వ తేదీ నుండి విజయనగరం, బళ్లారి జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బళ్లారి జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు (బీడీసీసీ) చెందిన కస్టమర్ల ఖాతాలకు ఆన్‌లైన్‌లో బదిలీలు జరగడం లేదని పలు శాఖలు నిర్ధారించాయి. ఈ సమాచారం 2025 జనవరి 13వ తేదీకి వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక విచారణ ప్రకారం, 10వ తేదీన బీడీసీసీ బ్యాంకు నుంచి ఐడీబీఐ బ్యాంక్‌కి సాధారణ నిధుల బదిలీ సమయంలో హ్యాకర్లు ఎక్స్ఎంఎల్ ఫైల్‌లలో ఖాతా నంబర్లను, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లను మార్చగలిగారని తేలింది.

వివరాలు 

ఆర్టీజీఎస్/ఎన్ఈఎఫ్టీ సేవలను తక్షణమే నిలిపివేత 

దీంతో కస్టమర్ల పేర్లను మార్చకుండానే ఉత్తర భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలోని 25 వేర్వేరు ఖాతాలకు నిధులు జమ చేయబడ్డాయి. ఇంకా, రూ. 5 లక్షలకుపైగా లావాదేవీలు ఇతర ఖాతాలకు మారినట్లు బ్యాంకు విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో బ్యాంక్ సిబ్బంది ఆర్టీజీఎస్/ఎన్ఈఎఫ్టీ సేవలను తక్షణమే నిలిపివేసి హోసాపేట టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం కేసును బళ్లారి సైబర్ ఎకనామిక్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేయగా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం,భారత న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లావాదేవీల కోసం ఉపయోగించిన కంప్యూటర్ వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.