LOADING...
Ponguleti Srinivasa Reddy: వడదెబ్బ బాధిత కుటుంబాలకు రూ.4 లక్షలు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
వడదెబ్బ బాధిత కుటుంబాలకు రూ.4 లక్షలు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

Ponguleti Srinivasa Reddy: వడదెబ్బ బాధిత కుటుంబాలకు రూ.4 లక్షలు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
May 23, 2026
03:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు వచ్చే మూడు రోజుల పాటు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు. ఎండలు, వడగాలుల పరిస్థితిపై మంత్రి నేడు అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు అవసరమైన సౌకర్యాలను వెంటనే కల్పించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద మజ్జిగతో పాటు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. అలాగే వడదెబ్బ కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని మంత్రి ప్రకటించారు.

Advertisement