Mohan Bhagwat: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు భద్రత పెంపు
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ భద్రతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాల స్థాయికి పెంచారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం, అంతకుముందు భగవత్ కు Z+ భద్రత కలిపించినట్లు హోం మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. దీనిని అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ లైజన్ (ASL)కి పెంచారు. కొద్దిరోజుల క్రితం భగవత్ భద్రతపై జరిగిన సమీక్ష ఆధారంగా భద్రతను పెంచుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు నివేదిక పేర్కొంది.
బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో భగవత్ భద్రత అంతంత మాత్రమే..
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ భగవత్ బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో పర్యటనలో ఉన్న సమయంలో ఆయనకు భద్రత అంతంత మాత్రంగానే ఉందని హోం మంత్రిత్వ శాఖ సమీక్షలో తేలింది. ఇది కాకుండా, భగవత్ అనేక రాడికల్ ఇస్లామిక్ సంస్థలతో సహా అనేక ఇతర సంస్థల లక్ష్యం కూడా. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ASL భద్రత గురించి వివరించడం జరిగింది. ప్రస్తుతం Z+లో భగవత్‌తో పాటు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) నుండి డిప్యూటేషన్‌పై అధికారులు, భద్రతా సిబ్బంది ఉన్నారు.
ASL భద్రత అంటే ఏమిటి?
ASL ప్రకారం, ప్రధానమంత్రి,హోంమంత్రికి మాత్రమే భద్రత ఇవ్వబడుతుంది. ఈ రక్షణ కింద, కేంద్ర ఏజెన్సీలు, భద్రతా బలగాలు కాకుండా, ఈ స్థాయి రక్షణ పొందుతున్న వ్యక్తి భద్రతకు సంబంధించిన జిల్లా పరిపాలన, పోలీసు, ఆరోగ్యం, ఇతర విభాగాలు వంటి స్థానిక సంస్థల భాగస్వామ్యం తప్పనిసరి. ఇందులో బహుళ-లేయర్డ్ సెక్యూరిటీ కవర్‌తో కూడిన విధ్వంస నిరోధక తనిఖీలు ఉన్నాయి. సూచించిన ప్రోటోకాల్స్ ప్రకారం ప్రత్యేకంగా రూపొందించిన హెలికాప్టర్లలో మాత్రమే హెలికాప్టర్ ప్రయాణానికి అనుమతి ఉంది.