Page Loader
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ మద్ధతు..వివక్ష ఉన్నంతవరకు అవి కొనసాగాల్సిందే 
వివక్ష ఉన్నంతవరకు అవి కొనసాగాల్సిందే

రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ మద్ధతు..వివక్ష ఉన్నంతవరకు అవి కొనసాగాల్సిందే 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 07, 2023
05:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో వివక్ష పీడిస్తోందని,అసమానతలు ఉన్నంత కాలం మినహాయింపులు ఉండాలని అభిప్రాయపడ్డారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఓ సమావేశంలో మరాఠాలు రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న సందర్భంగా భగవత్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. సమాజంలో తోటి మనుషులను వెనుకబడేలా చేశామని, వారిని నిర్లక్ష్యం చేశామన్నారు. ఇలా 2 వేల ఏళ్ల పాటు కొనసాగిందన్నారు. సమానత్వం కోసమే రిజర్వేషన్లు పెట్టుకున్నట్లు చెప్పారు. వివక్ష ఉన్నంత కాలం రిజర్వేషన్లు కొనసాగించాలని, ఇందుకు ఆర్ఎస్ఎస్ పూర్తిస్థాయి మద్దతిస్తుందన్నారు. ఆర్థిక, రాజకీయ సమానత్వాన్ని గుర్తించడమే కాదు, ఆయా వర్గాలకు గౌరవాన్ని ఇవ్వాలన్నారు. వివక్ష పేరిట 2000 ఏళ్లు బాధపడ్డారని, వివక్ష లేని వాళ్లు మరో 200 ఏళ్లు ఇబ్బందులను అంగీకరించవచ్చన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సమాజంలో ఇప్పటికీ వివక్ష ఉంది : మోహన్ భగవత్