LOADING...
Mahalakshmi Scheme: మహాలక్ష్మి పథకానికి రూ.7,777 కోట్లు కోరిన ఆర్టీసీ
మహాలక్ష్మి పథకానికి రూ.7,777 కోట్లు కోరిన ఆర్టీసీ

Mahalakshmi Scheme: మహాలక్ష్మి పథకానికి రూ.7,777 కోట్లు కోరిన ఆర్టీసీ

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 20, 2026
11:00 am

ఈ వార్తాకథనం ఏంటి

'మహాలక్ష్మి' పథకం అమలు కొనసాగింపుతో పాటు ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కల్పించేందుకు, రవాణా మౌలిక వసతుల విస్తరణకు అవసరమైన నిధులను సమృద్ధిగా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్నిఆర్టీసీ తన బడ్జెట్ ప్రతిపాదనల్లో కోరింది. మహాలక్ష్మి పథకం కింద రీయింబర్స్‌మెంట్‌గా రూ.7,777 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో 680 కొత్త బస్సుల కొనుగోలుకు రూ.241.37 కోట్లు అవసరమని తెలిపింది. అదేవిధంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.442.61 కోట్లు, కొత్త డిపోలు,బస్‌స్టేషన్ల నిర్మాణానికి, అలాగే పెండింగ్ రుణాల చెల్లింపుల కోసం రూ.855 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని ప్రతిపాదించింది. విద్యార్థులు, జర్నలిస్టులు, దివ్యాంగులకు అందించే బస్‌పాస్‌ల నిమిత్తం రూ.358 కోట్లు కేటాయించాలని కూడా ఆర్టీసీ అభ్యర్థించింది.

వివరాలు 

వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.7,519 కోట్ల ఆదాయం

ఇక రవాణా శాఖ విషయానికి వస్తే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి మొత్తం రూ.7,519 కోట్ల ఆదాయం అందిస్తామని తన అంచనాల్లో పేర్కొంది. ఇందులో లైఫ్‌ట్యాక్స్ ద్వారా రూ.5,143 కోట్లు, త్రైమాసిక పన్ను ద్వారా రూ.1,031 కోట్లు, ఇతర పన్నుల ద్వారా మిగిలిన ఆదాయం లభిస్తుందని వెల్లడించింది. ఖర్చుల పరంగా రూ.830 కోట్లు ప్రతిపాదించగా, ఈ మొత్తాన్ని భవనాల నిర్మాణం, వ్యవస్థల ఆధునికీకరణ వంటి అవసరాలకు వినియోగించనున్నట్లు తెలిపింది.

Advertisement