LOADING...
TGSRTC: ఆక్యుపెన్సీ పెంపు దిశగా ఆర్టీసీ అడుగు.. మార్చి 1 నుంచి కొత్త చార్జీలు
ఆక్యుపెన్సీ పెంపు దిశగా ఆర్టీసీ అడుగు.. మార్చి 1 నుంచి కొత్త చార్జీలు

TGSRTC: ఆక్యుపెన్సీ పెంపు దిశగా ఆర్టీసీ అడుగు.. మార్చి 1 నుంచి కొత్త చార్జీలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 26, 2026
08:28 am

ఈ వార్తాకథనం ఏంటి

టీజీఎస్ఆర్టీసి నష్టాలను నియంత్రిస్తూ, ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్‌)ను పెంచే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో డీలక్స్‌ బస్సులు, ఈ-మెట్రో ఏసీ సర్వీసుల్లో టికెట్‌ ధరలను తగ్గిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉన్నతాధికారులు అన్ని డిపో మేనేజర్లకు సర్క్యులర్‌ పంపించారు. కొత్తగా నిర్ణయించిన చార్జీలు మార్చి 1 నుంచి మే నెల చివరి వరకు అమల్లో ఉండనున్నాయి. ఎండాకాలంలో తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా ఏసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య పెంచేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు సమాచారం.

వివరాలు 

ప్రయోజనాలు ఇవి..

గ్రేటర్‌ నగర పరిధిలో ప్రస్తుతం 275 మెట్రో డీలక్స్‌ బస్సులు 255 ట్రిప్పులు నిర్వహిస్తుండగా, 90 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు రోజుకు 731 ట్రిప్పులు నడుస్తున్నాయి. అయితే ఈ సర్వీసుల్లో సుమారు 60 శాతం వరకు సీట్లు ఖాళీగా ఉండటంతో ఆదాయం తగ్గుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని చార్జీల సవరణకు ఆర్టీసీ నిర్ణయించింది. తాజాగా ప్రకటించిన ధరల ప్రకారం మెట్రో డీలక్స్‌ బస్సుల్లో నాలుగు కిలోమీటర్ల ప్రయాణానికి ఇంతకుముందు రూ.30 వసూలు చేయగా, ఇప్పుడు రూ.25కు తగ్గించారు. అలాగే అదే దూరానికి ఈ-మెట్రో ఏసీ సర్వీసులో ముందుగా రూ.35 తీసుకోగా, ప్రస్తుతం రూ.25గా నిర్ణయించారు. దీంతో ప్రయాణికులకు కొంత భారం తగ్గనుండగా, ఏసీ సర్వీసుల వినియోగం పెరుగుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

Advertisement