LOADING...
TGSRTC: టూర్‌కి, తీర్థయాత్రలకు ఆర్టీసీ స్పెషల్ ప్యాకేజీలు
టూర్‌కి, తీర్థయాత్రలకు ఆర్టీసీ స్పెషల్ ప్యాకేజీలు

TGSRTC: టూర్‌కి, తీర్థయాత్రలకు ఆర్టీసీ స్పెషల్ ప్యాకేజీలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 20, 2026
12:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

టూర్‌కు వెళ్లాలనుకునే ప్రయాణికుల కోసం తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. ఈ ప్యాకేజీల్లో భాగంగా ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా నడుపుతోంది. ఈ నెల 23న కోల్హాపూర్ యాత్ర, అలాగే వచ్చే నెల 6న గోవా యాత్రకు వెళ్లే అవకాశం కల్పిస్తోంది. అదేవిధంగా హైదరాబాద్ బీహెచ్‌ఈఎల్ డిపో నుంచి సెలవు దినాల్లో సూపర్ లగ్జరీ, రాజధాని బస్సులను ప్రత్యేకంగా నడుపుతున్నారు. ఈ బస్సుల ద్వారా కాళేశ్వరం, మేడారం‌తో పాటు శ్రీశైలం, అరుణాచలం, కంచి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు ప్రయాణించవచ్చు.

Details

పలు డిపోల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు

ఈ నెల 23న బీహెచ్‌ఈఎల్ డిపో నుంచి గానుగాపూర్, కోల్హాపూర్, తుల్జాపూర్ ప్రాంతాలకు ప్రత్యేక బస్సు బయలుదేరనుంది. కేవలం రూ.3 వేలకే ఈ స్పెషల్ టూర్ ప్యాకేజీని ప్రయాణికులు పొందవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. మరోవైపు, మేడారం జాతర సందర్భంగా గ్రేటర్ జోన్ పరిధిలోని పలు డిపోల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా ఏర్పాటు చేయనున్నారు. అలాగే, వచ్చే నెల 6న 'గోవా యాత్ర' పేరుతో హైదరాబాద్ నుంచి ప్రత్యేక సర్వీస్ అందుబాటులో ఉంటుంది. ఒక్కో టికెట్‌కు రూ.3,500 చెల్లిస్తే హంపి, గోవా, తుల్జాపూర్ ప్రాంతాలకు వెళ్లి తిరిగి రావచ్చు. ఈ టూర్ ప్యాకేజీలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం 9391072283, 9063401072 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.

Advertisement