నేడు ముంబై విమానాశ్రయం రన్‌వేలు మూసివేత.. కారణం ఇదే..
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం మంగళవారం 6గంటల పాటు మూసివేయనున్నారు. ఉదయం 11నుంచి సాయంత్రం 5 గంటల వరకు రన్‌వేలపై కార్యకలాపాలను నిలిపివేసినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. మెయింటెనెన్స్ పనుల వల్లే విమానాశ్రయంలోని రన్ వేలలను మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమయంలో విమానాల రాకపోకలను నిలిపివేసినట్లు వివరించారు. విమానశ్రయంలో ప్రతిఏడాది వర్షాకాలం తర్వాత మెయింటెనెన్స్ పనులు చేస్త్తారు. ఈ ఏడాది వర్షాకాలానికి ముందు మే 2న విమానాశ్రయం రెండు రన్‌వేల మరమ్మతు పనులను చేపట్టారు. రద్దీగా ఉండే విమానాశ్రయంలో 5గంటలపాటు విమానాలను నిలిపివేస్తే, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్తగా ప్రయాణికులు సహకరించాలని విమానాశ్రయ వర్గాలు కోరాయి.