LOADING...
మోదీకి పుతిన్ ఫోన్.. G20 సమ్మిట్‌కు రష్యా తరఫున విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్
మోదీకి పుతిన్ ఫోన్.. G20 సమ్మిట్‌కు రష్యా తరఫున విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్

మోదీకి పుతిన్ ఫోన్.. G20 సమ్మిట్‌కు రష్యా తరఫున విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 29, 2023
11:20 am

ఈ వార్తాకథనం ఏంటి

న్యూ దిల్లీలో జరగనున్న జీ20 సదస్సులో పాల్గొనేందుకు తాను భారత్‌కు రాలేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి తెలిపారు. సెప్టెంబరు 9, 10 తేదీల్లో జరిగే సదస్సులో రష్యా తరఫున విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ పాల్గొంటారని పుతిన్ తెలిపారు. ఈ సంవత్సరం జీ-20 బృందానికి ఇండియా అధ్యక్షత వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సమావేశానికి పుతిన్ వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాశాలున్నాయని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, పుతిన్ ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. తాను వర్చువల్‌ లేక వ్యక్తిగతంగా గాని ఈ సదస్సులో పాలొగొనని తెలిపారు.

Details 

బ్రిక్స్ సదస్సుకు కూడా పుతిన్ బదులు సెర్గీ లావ్రోవ్

తన విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ హాజరవుతారని పుతిన్ స్పష్టం చేశారు. దక్షిణాఫ్రికా జోహన్నెస్ బర్గ్‌లో బ్రిక్స్ సదస్సుకు కూడా పుతిన్ బదులు ఆయన తరపున సెర్గీ లావ్రోవ్ పాల్గొన్నారు. ఉక్రెయిన్‌పై దాడుల నేపథ్యంలో ఈ సంవత్సరం మార్చిలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు రష్యా అధ్యక్షుడిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. విదేశాలకు వెళితే అరెస్ట్ చేస్తారనే పుతిన్ జీ20 సదస్సుకు హాజరయ్యేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.