Page Loader
హౌసింగ్ సొసైటీలో మహిళా గార్డుపై అత్యాచారం.. ఆపై ఆమె మృతి 
హౌసింగ్ సొసైటీలో మహిళా గార్డుపై అత్యాచారం.. ఆపై ఆమె మృతి

హౌసింగ్ సొసైటీలో మహిళా గార్డుపై అత్యాచారం.. ఆపై ఆమె మృతి 

వ్రాసిన వారు Stalin
Aug 29, 2023
10:47 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్ ఘజియాబాద్‌లోని హౌసింగ్ సొసైటీలో పనిచేస్తున్న 19ఏళ్ల మహిళా సెక్యూరిటీ గార్డుపై సూపర్‌వైజర్ అత్యాచారం చేశాడు. అనంతరం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు అజయ్ (32)ని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అత్యాచారం ఆదివారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆమె పరిస్థితి విషమించడంతో సహోద్యోగులు బాధితురాలిని దిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో సోమవారం బాధితురాలు తుదిశ్వాస విడిచినట్లు చెప్పారు.

యూపీ

సామూహిక అత్యాచారం జరిగినట్లు కుటుంబ సభ్యుల ఆరోపణ

సొసైటీలోని బేస్‌మెంట్‌లో ముగ్గురు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారని, అది తట్టుకోలేక ఆమె విషం తాగినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అత్యాచారానికి గురైన మహిళ జార్ఖండ్‌కు చెందిన వ్యక్తి కాగా, హౌసింగ్ సొసైటీకి సమీపంలో తన అత్తతో కలిసి నివసిస్తోందని పోలీసులు వెల్లడించారు. బేస్‌మెంట్ లోపల అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించామని, సామూహిక అత్యాచారం జరిగినట్లు కనిపించలేదను డీసీపీ(రూరల్) వివేక్ చంద్ యాదవ్ తెలిపారు. సామూహిక అత్యాచారం జరగలేదని తేలడంతో అత్యాచారం సెక్షన్ (376 ఐపిసి) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు వివేక్ చంద్ యాదవ్ వెల్లడించారు.