LOADING...
Jaishankar-Venezuela:'పౌరుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి'.. మదురో కిడ్నాప్‌పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు

Jaishankar-Venezuela:'పౌరుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి'.. మదురో కిడ్నాప్‌పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 07, 2026
09:47 am

ఈ వార్తాకథనం ఏంటి

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా కిడ్నాప్ చేసిన ఘటనపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై భారతదేశం ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు. జైశంకర్ లక్సెంబర్గ్ ఉపప్రధాన మంత్రి,విదేశాంగ మంత్రి జేవియర్ బెట్టెల్‌తో జరిగిన సమావేశంలో ఈ అభిప్రాయాన్ని వ్యక్తపరచారు. ఈ సమావేశంలో ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సంబంధాలు, భవిష్యత్ సహకారంపై చర్చలు జరిపారు. వెనిజులాతో భారత్‌కు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. అలాంటి సందర్భంలో మదురోను కిడ్నాప్ చేయడం ఆందోళన కలిగిస్తోంది. పౌరుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్ని పక్షాలను కోరుతున్నాము" అని పేర్కొన్నారు.

వివరాలు 

భారతదేశం,లక్సెంబర్గ్ దేశాల మధ్య 78 సంవత్సరాల దౌత్య సంబంధాలు

"వెనిజులాలో జరుగుతున్న పరిణామాలను మేము గౌరవిస్తున్నాము. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అన్ని పక్షాలు ఒక సమన్వయ దృక్పథానికి రావాలని కోరుకుంటున్నాము" అని జైశంకర్ స్పష్టం చేశారు. అంతేకాక, భారతదేశం,లక్సెంబర్గ్ దేశాల మధ్య 78 సంవత్సరాల దౌత్య సంబంధాలు కొనసాగుతున్నట్లు కూడా జైశంకర్ గుర్తు చేశారు. గత శనివారం, అమెరికా సైన్యం వెనిజులాపై దాడి చేసి, అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్యను కిడ్నాప్ చేసి అమెరికాకు తరలించింది. ఆ తర్వాత డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. ఇదిలా ఉండగా, అమెరికా దాడిలో 32 మంది వెనిజులా భద్రతా సిబ్బంది మరణించినట్లు సమాచారం అందుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

లక్సెంబర్గ్ ఉపప్రధాన మంత్రి,విదేశాంగ మంత్రి జేవియర్ బెట్టెల్‌తో జైశంకర్ సమావేశం 

Advertisement