Page Loader
Sabarimala Temple: మళ్లీ తెరుచుకున్న శబరిమల ఆలయం.. భారీగా తరలివచ్చిన భక్తులు 
Sabarimala Temple: మళ్లీ తెరుచుకున్న శబరిమల ఆలయం.. భారీగా తరలివచ్చిన భక్తులు

Sabarimala Temple: మళ్లీ తెరుచుకున్న శబరిమల ఆలయం.. భారీగా తరలివచ్చిన భక్తులు 

వ్రాసిన వారు Stalin
Dec 31, 2023
11:05 am

ఈ వార్తాకథనం ఏంటి

మండల పూజల తర్వాత మూసివేసిన శబరిమల అయ్యప్ప ఆలయం తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి. మకరవిళక్కు తీర్థయాత్ర ప్రారంభమైన నేపథ్యంలో ఆలయాన్ని తిరిగి తెరిచారు. ఆలయ ద్వారాలను ప్రధాన అర్చకుడు ఆధ్వర్యంలో మేల్‌శాంతి పీఎన్‌ మహేశ్‌ నంబూతిరి ఆలయాన్ని ప్రారంభించారు. మకరవిళక్కు సందర్భంగా జనవరి 13న సాయంత్రం ప్రసాద శుద్ధక్రియ నిర్వహిస్తారు. జనవరి 14న ఉదయం బింబశుద్ధిక్రియ కూడా నిర్వహిస్తారు. జనవరి 15న మకరవిళక్కు కార్కక్రమం ఉంటుంది. అదే రోజు తెల్లవారుజామున 2.46 గంటలకు మకరసంక్రమ పూజలు నిర్వహిస్తారు. సాధారణ పూజల అనంతరం ఆ రోజు తిరువాభరణం, దీపారాధన ఉంటుంది. అనంతరం మకరజ్యోతి దర్శనం ఉంటుంది.

కేరళ

పోటెత్తిన భక్తులు

మండల పూజ అనంతరం డిసెంబర్ 27న ఆలయాన్ని మూసివేశారు. ఇప్పుడు ఆలయం తెరుచుకున్న నేపథ్యంలో భక్తులు పోటెత్తారు. ఆలయం మూసి ఉన్న నేపథ్యంలో వేలాది మంది భక్తులు నడకదారిలోనే ఉండిపోయారు. అయితే భక్తుల కోసం ఆలయ నిర్వాహకులతో పాటు కేరళ ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యాలను కల్పించింది. అయ్యప్ప భక్తులకు మందులతో కూడిన తాగునీటిని కూడా అందుబాటులో ఉంచారు. జనవరి 15న మకర జ్యోతి దర్శనం ఉంటుంది. ఆ రోజు నాటికి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. జనవరి 20 వరకు యాత్రికులు దర్శించుకునే అవకాశం ఉంటుంది. జనవరి 21న ఊరేగింపుతో ఆలయం తలుపులు మూసివేస్తారు. ఆలయం తలుపులు మూసివేసిన తర్వాత భక్తులను లోపలికి అనుమతించరు.