Loading...
Centre : ఇన్‌స్టాగ్రామ్‌ ప్రకటనల్లో బాలలపై లైంగిక కంటెంట్‌.. మెటాకు కేంద్రం హెచ్చరిక
ఇన్‌స్టాగ్రామ్‌ ప్రకటనల్లో బాలలపై లైంగిక కంటెంట్‌.. మెటాకు కేంద్రం హెచ్చరిక

Centre : ఇన్‌స్టాగ్రామ్‌ ప్రకటనల్లో బాలలపై లైంగిక కంటెంట్‌.. మెటాకు కేంద్రం హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 18, 2026
01:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇన్‌స్టాగ్రామ్‌ ప్రకటనల్లో బాలలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ వ్యాప్తి చెందుతున్న అంశంపై కేంద్ర ప్రభుత్వం మెటా అధికారులతో చర్చలు కొనసాగిస్తోంది. కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ అంశంపై మెటా ప్రతినిధులతో చర్చిస్తున్నారు. బాలలపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఏ రూపంలోని కంటెంట్‌నైనా సహించబోమని సంస్థకు కేంద్రం స్పష్టం చేసినట్లు వెల్లడించింది. కంటెంట్‌ రూపకల్పన, మోడరేషన్‌ విషయంలో భారతదేశంలోని భిన్న భాషలు, సాంస్కృతిక సున్నితత్వాలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రం సూచించింది. బాలలపై లైంగిక వేధింపులకు సంబంధించిన మెటీరియల్‌ (CSAM) విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే సోషల్‌ మీడియా వేదికలతో పాటు సంబంధిత వ్యక్తులు కూడా చట్టపరమైన రక్షణను కోల్పోయే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.

వివరాలు 

ప్రపంచవ్యాప్తంగా CSAMకు వ్యతిరేకత

బాలలపై లైంగిక వేధింపులకు సంబంధించిన మెటీరియల్‌ను భారత్‌తో పాటు ప్రపంచంలోని అనేక దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని కేంద్రం పేర్కొంది.

ప్లాట్‌ఫామ్‌ నిబంధనలను అమలు చేసే సమయంలో కంటెంట్‌ మోడరేషన్‌ వ్యవస్థలు వివిధ దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.

వాక్‌ స్వాతంత్ర్యం ఎంతో కీలకమైన హక్కు అయినప్పటికీ.. ప్రతి దేశంలోని సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు ఒకేలా ఉండవని కేంద్రం తెలిపింది.

అందువల్ల ఆయా దేశాల పరిస్థితులకు అనుగుణంగా కంటెంట్‌ మోడరేషన్‌ విధానాలను రూపొందించి అమలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.

వివరాలు 

ఏఐ వీడియోలపైనా కేంద్రం ఆందోళన

సోషల్‌ మీడియా వేదికల్లో కనిపిస్తున్న ఏఐ రూపొందించిన వీడియోలపైనా కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

ఒక కంటెంట్‌ను కృత్రిమ మేధ (AI) ద్వారా రూపొందించారా? లేక మనుషులు స్వయంగా సృష్టించారా? అనే విషయం వినియోగదారులకు స్పష్టంగా తెలిసేలా ప్రత్యేక లేబుల్స్‌ ఏర్పాటు చేయాలని ప్లాట్‌ఫామ్‌లను కోరింది.

దీంతో కంటెంట్‌ అసలు స్వరూపాన్ని వినియోగదారులు సులభంగా గుర్తించే అవకాశం ఉంటుందని పేర్కొంది.

ADVERTISEMENT

వివరాలు 

సోషల్‌ మీడియాలు దేశ చట్టాలను పాటించాల్సిందే

కేంద్రం ఏదైనా ఖాతాను తొలగించాలని సూచించినప్పుడు.. ఆ ఆదేశానికి సంబంధించిన సమాచారాన్ని బహిర్గతం చేసేలా 'ఎక్స్‌' కొత్త నిబంధనను తీసుకొచ్చింది.

దీంతో తమ ఖాతాను బ్లాక్‌ చేయాలని ఎవరు కోరారో వినియోగదారులు తెలుసుకునే అవకాశం ఉంటుంది.

అలాగే ఖాతాపై చర్యలు తీసుకోవడానికి గల చట్టపరమైన కారణాలను కూడా తెలుసుకునే వీలు కలుగుతుంది.

ఈ పరిణామంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. భారత్‌లో పనిచేసే ఏ సోషల్‌ మీడియా వేదిక అయినా దేశంలోని చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.

ప్లాట్‌ఫామ్‌ల విధానాలు ఏవైనా.. అవి భారత చట్టాలకు అనుగుణంగానే ఉండాలని కేంద్రం తేల్చిచెప్పింది.

ADVERTISEMENT