Page Loader
Andhrapradesh: గురుకులాల్లో పని చేసేవారికీ గుడ్ న్యూస్.. ఔట్‌సోర్సింగ్‌ బోధనా సిబ్బంది వేతనాలు పెంపు
గురుకులాల్లో పని చేసేవారికీ గుడ్ న్యూస్.. ఔట్‌సోర్సింగ్‌ బోధనా సిబ్బంది వేతనాలు పెంపు

Andhrapradesh: గురుకులాల్లో పని చేసేవారికీ గుడ్ న్యూస్.. ఔట్‌సోర్సింగ్‌ బోధనా సిబ్బంది వేతనాలు పెంపు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 01, 2025
05:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన గురుకుల విద్యాసంస్థల్లో ఔట్‌సోర్సింగ్‌ ద్వారా పనిచేస్తున్న బోధనా సిబ్బందికి శుభవార్త అందించింది. వారి వేతనాల్లో పెంపును ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 1,659 మంది సిబ్బందికి ఈ పెంపు వర్తించనుంది. కేటగిరీ-ఏలోకి వచ్చే రెసిడెన్షియల్‌ స్కూళ్లు, కళాశాలల్లో పనిచేస్తున్న బోధనా సిబ్బందికి వేతనాలు పెరిగాయి. ఇందులో: జూనియర్ లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్ (సి), లైబ్రేరియన్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు (PGTs) వేతనం రూ.24,150కి పెంచారు. ట్రెయిన్‌డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (TGTs), ఫిజికల్ డైరెక్టర్ (ఎస్) వేతనాన్ని రూ.19,350కు పెంచారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు (PETs), ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ సిబ్బందికి వేతనం రూ.16,300కి పెరిగింది.

వివరాలు 

 ఉత్తర్వులు విడుదల చేసిన గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి 

కేటగిరీ-బీలోకి వచ్చే స్కూళ్లు,కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో పనిచేస్తున్న సిబ్బందికీ వేతనాలలో పెంపు జరిగింది. ఇందులో: జూనియర్ లెక్చరర్లు - మొత్తం 40 మందికి వేతనాలు పెరిగాయి. పీజీటీలు - మొత్తం 18 మందికి వేతనాల్లో పెంపు చేశారు. వారి వేతనాలు రూ.25,000 నుంచి రూ.31,250కి పెరిగాయి. అదే విధంగా, అరకు వ్యాలీలో ఉన్న బాలుర స్పోర్ట్స్ స్కూల్లో పనిచేస్తున్న కోచ్‌ల వేతనాల్లోనూ మార్పు జరిగింది: కోచ్‌ వేతనం రూ.25,000 నుండి రూ.31,250కి పెరిగింది. అసిస్టెంట్ కోచ్‌ వేతనం రూ.22,000 నుండి రూ.27,500కు పెంచారు. ఈ ఉత్తర్వులను గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి అధికారికంగా విడుదల చేశారు.