LOADING...
Thalliki Vandanam : తల్లికి వందనం లబ్ధిదారులకు అలర్ట్‌.. అకౌంట్లోకి డబ్బులు పడేది ఆ రోజే!
తల్లికి వందనం లబ్ధిదారులకు అలర్ట్‌.. అకౌంట్లోకి డబ్బులు పడేది ఆ రోజే!

Thalliki Vandanam : తల్లికి వందనం లబ్ధిదారులకు అలర్ట్‌.. అకౌంట్లోకి డబ్బులు పడేది ఆ రోజే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 07, 2026
03:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకం కొనసాగుతోంది. ఈపథకం కింద ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభ రోజునే విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం ఆర్థిక సాయం జమ చేస్తోంది. 'తల్లికి వందనం' పథకం ద్వారా ప్రతి విద్యార్థికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇందులో రూ.13వేల మొత్తాన్ని నేరుగా విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేయనుండగా, మిగిలిన రూ.2 వేలును పాఠశాల అభివృద్ధి నిధిగా ప్రభుత్వం కేటాయిస్తోంది. అయితే ఈ పథకం ప్రయోజనం పొందాలంటే విద్యార్థులు, తల్లిదండ్రుల వివరాలు పూర్తిగా ఉండటం అవసరమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

వివరాలు

జూన్ 19 లేదా 20 తేదీల్లో జమ

ఆధార్ అనుసంధానం సహా అన్ని వివరాలు సరైన విధంగా నమోదు కాకపోతే ప్రభుత్వం విడుదల చేసే నిధులు ఖాతాల్లో జమ కావని హెచ్చరిస్తున్నారు. మొదట ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యే జూన్ 12వ తేదీన 'తల్లికి వందనం' పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయాల్సి ఉంది. అయితే ఈసారి నిధుల జమ ప్రక్రియ కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అర్హుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించే ప్రక్రియ ఇంకా కొనసాగుతుండటంతో చెల్లింపుల తేదీలో మార్పు చోటుచేసుకున్నట్లు సమాచారం. దీంతో జూన్ 12కు బదులుగా జూన్ 19లేదా 20తేదీల్లో విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో 'తల్లికి వందనం' నిధులు జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement