ఉత్తర్‌ప్రదేశ్: నకిలీ జనన ధృవీకరణ పత్రం కేసులో దోషిగా తేలిన ఆజం ఖాన్, కుటుంబం
నకిలీ జనన ధృవీకరణ పత్రం కేసులో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నాయకుడు ఆజం ఖాన్, అతని భార్య తంజీమ్ ఫాతిమా,వారి కుమారుడు అబ్దుల్లా ఆజం ఖాన్‌లను ఉత్తర్‌ప్రదేశ్ లోని రాంపూర్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ కేసు అబ్దుల్లా ఆజం ఖాన్ డబుల్ బర్త్ సర్టిఫికేట్ కేసుకు సంబంధించినది.అబ్దుల్లా ఆజం ఖాన్ మొదటి జనన ధృవీకరణ పత్రంతో పాస్‌పోర్ట్,విదేశీ పర్యటనలను చేశారని,రెండవ సర్టిఫికేట్‌ను ప్రభుత్వ సంబంధిత ప్రయోజనాల కోసం ఉపయోగించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ రెండు సర్టిఫికెట్లు మోసపూరిత మార్గాల ద్వారా,ముందస్తు ప్రణాళికలో భాగంగా జారీ చేయబడ్డాయి. రాంపూర్ నగర్ పాలికా ద్వారా 2012లో జారీ చేయబడిన మొదటి జనన ధృవీకరణ పత్రం రాంపూర్‌ను అబ్దుల్లా ఆజం ఖాన్ జన్మస్థలంగా చూపింది.
2019 ద్వేషపూరిత ప్రసంగం కేసులో దోషులు
జనవరి 2015లో, జారీ చేయబడిన రెండవ జనన ధృవీకరణ పత్రం లక్నోను అతని జన్మస్థలంగా చూపింది. సెక్షన్ 420, 467, 468 , 471 కింద అబ్దుల్లా ఆజం ఖాన్, అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేసారు. అజం ఖాన్, అతని కుమారుడిని గురువారం నాటి తీర్పు దోషులుగా నిర్ధారించిన మరో కేసుగా గుర్తించబడింది. రాంపూర్‌లోని కోర్టు 2019 ద్వేషపూరిత ప్రసంగం కేసులో ఇద్దరినీ దోషులుగా నిర్ధారించింది. అంతేకాకుండా, ఆజం ఖాన్,అతని కుమారుడు అబ్దుల్లా భూకబ్జా కేసుల్లో ఇరుక్కున్నారు. ఇంతకుముందు, ఆజం ఖాన్,అబ్దుల్లా రాంపూర్ జిల్లాలోని సువార్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.