Sambhal violence: బయటపడిన ఆడియో క్లిప్.. ఆయుధాలు తీసుకురావాలని కోరిన వ్యక్తి..
సంభాల్ హింసకు సంబంధించిన తాజా వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఓ ఆడియో క్లిప్ ద్వారా ఈ ఘటనకు సంబంధించిన కీలక అంశాలు బయటపడ్డాయి. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ లోని జామా మసీదు సమీపంలో అధికారులు, పోలీసులు సర్వే నిర్వహించడానికి వెళ్లినపుడు ఆందోళనకారుల భారీ గుంపు రాళ్ల దాడి చేసారు. ఈ ఘర్షణలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు, 20 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. ఆందోళనకారులు పలు ఇళ్లు ధ్వంసం చేయడంతో పాటు వాహనాలను అగ్నికి ఆహుతి చేశారు. ఈ ఘటనలో మసీదు సమీపానికి పెద్ద సంఖ్యలో వ్యక్తులు ఎలా చేరుకున్నారో, ఆయుధాలు ఎలా సేకరించారో అనే అంశాలపై ఆడియో క్లిప్‌లో వివరాలు ఉన్నాయి.
25 మంది అరెస్ట్, 7 ఎఫ్ఐఆర్‌లు నమోదు
దర్యాప్తు చేస్తున్న అధికారులు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లలో ఈ ఆడియో క్లిప్ దొరికింది. ఆడియోలో, ఒక గుర్తుతెలియని వ్యక్తి, మొఘల్ కాలపు షాహీ జామా మసీదు దగ్గరకు ఎక్కువమందిని తీసుకురావాలని పిలుపునిచ్చాడు. "సామన్ లేకర్ ఆ మస్జద్ కే పాస్, మేరే భాయ్ కా ఘర్ హై" అని ఆ వ్యక్తి చెప్పాడు, అంటే ఆయుధాలతో మసీదు దగ్గరికి రా, నా సోదరుడి ఇల్లు సమీపంలో ఉంది. ఈ కేసులో ఇప్పటి వరకు 25 మందిని పోలీసులు అరెస్ట్ చేసి, 7 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ బార్క్,స్థానిక ఎమ్మెల్యే ఇక్బాల్ మొహమూద్ కుమారుడు సోహైల్ ఇక్బాల్ పేర్లు ఎఫ్ఐఆర్‌లో ఉన్నారు.
బార్క్ షాహీ జామా మసీదు సమీపంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు
ఈ హింసకు రెండు రోజుల ముందు బార్క్ షాహీ జామా మసీదు సమీపానికి వెళ్లి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొనబడింది. అలాగే, షాహీ జామా మసీదు ఉన్న స్థలంలో పురాతన హరిహర్ దేవాలయం ఉన్నదని,ఈ విషయంపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. కోర్టు ఆదేశాలు మేరకు మసీదు సర్వేను నిర్వహించేందుకు అధికారులు పంపించబడ్డారు.ఆదివారం, మసీదు సమీపంలో ఆందోళనకారులు సర్వే బృందంపై దాడికి దిగారు. హిందూ పక్షం కోర్టులో పిటిషన్ దాఖలు చేసి,మొఘల్ రాజు బాబర్ కాలంలో ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించారని తెలిపారు.
విధ కోణాల్లో దర్యాప్తు
ఈ చరిత్ర ఆధారంగా హిందూ పక్షం"బాబార్ నామా","ಐన్ ఏ అక్బరీ" వంటి చారిత్రక గ్రంథాలను కోర్టుకు సమర్పించింది. మరొక వైపు,ముస్లిం పక్షం 1991 సంవత్సరం ప్రార్థనా స్థలాల చట్టం ప్రకారం,1947 ఆగస్టు 15 తర్వాత ఎలాంటి మార్పులు జరగకూడదని పేర్కొంది. ఈ సంఘటనపై ఇంకా వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.