తదుపరి వార్తా కథనం

Sankranti holidays: తెలంగాణాలో నేటి నుండి సంక్రాంతి సెలవులు
వ్రాసిన వారు
Sirish Praharaju
Jan 12, 2024
10:45 am
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో నేటి నుండి ఈ నెల 17 వ తేదీ వరకు పాఠశాలలన్నింటికీ ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది.
ఈ నెల 18 వ తేదీ నుండి పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయని తెలిపింది.అలాగే రేపటి నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు సంక్రాంతి సెలవులు ప్రకటించింది.
జూనియర్ కళాశాలలు తిరిగి ఈ నెల 17వ తేదీ నుండి పునఃప్రారంభమవుతాయి.
సెలవుల సమయంలో తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని బోర్డు హెచ్చరించింది.మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 9వ తేదీ నుంచి 18వ తారీఖు వరకు ప్రభుత్వ,ప్రైవేట్ స్కూల్స్ కు సెలవులు ఇవ్వగా.. ఇంటర్,ట్రిపుల్ ఐటీ కాలేజీలకు నిన్నటి నుంచే హాలీడేస్ స్టార్ట్ అయ్యాయి.