LOADING...
CM Chandra Babu: ప్రజల సంక్షేమంలో సత్యసాయి ట్రస్ట్ అగ్రగామి : సీఎం చంద్రబాబు
ప్రజల సంక్షేమంలో సత్యసాయి ట్రస్ట్ అగ్రగామి : సీఎం చంద్రబాబు

CM Chandra Babu: ప్రజల సంక్షేమంలో సత్యసాయి ట్రస్ట్ అగ్రగామి : సీఎం చంద్రబాబు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 22, 2025
01:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీ సత్యసాయి బాబా సేవా స్పూర్తి ప్రపంచానికి ఆదర్శమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మంత్రి నారా లోకేష్‌తో కలిసి పాల్గొన్న ఆయన, సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస—ఇవి సత్యసాయి జీవన సూత్రాలు, ఇవే ప్రపంచాన్ని శాంతి మార్గంలో నడిపే విలువలని గుర్తుచేశారు. అలాగే, సత్యసాయి బాబా సేవలు అపారమైనవని ముఖ్యమంత్రి అభినందించారు. సత్యసాయి బాబా సేవా కార్యక్రమాల గురించి వివరించగా, చంద్రబాబు నాయుడు తెలిపారు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో లక్షలాది మందికి తాగునీటి సౌకర్యం అందించినది ఈ మొదటి సేవా కార్యక్రమం అని చెప్పారు.

Details

 వాలంటీర్ల సంఖ్య 7.50 లక్షలు ఉండటం విశేషం

తాగునీటి ప్రాజెక్టుల కోసం ప్రశాంతి నిలయాన్ని తాకట్టు పెట్టడానికీ సత్యసాయి బాబా సిద్ధంగా ఉన్నారని, అయితే భక్తుల విరాళాల వల్ల ప్రాజెక్టులు విజయవంతమయ్యాయని చెప్పారు. సత్యసాయి సేవాసంస్థలో పనిచేస్తున్న వాలంటీర్ల సంఖ్య 7.50 లక్షలు ఉండటం విశేషమని, ఎలాంటి ప్రభుత్వ లేదా ప్రైవేట్ వ్యవస్థకు ఇంత శక్తి లేదని చంద్రబాబు అభినందించారు. ఈ ఉత్సవాల సందర్భంగా సత్యసాయి ట్రైబల్ విమెన్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్ ప్రారంభించడం ఆనందకరమని, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి సత్యసాయి ట్రస్ట్ అందిస్తున్న వైద్య సేవలు ప్రశంసనీయం అని ఆయన పేర్కొన్నారు.